ETV Bharat / bharat

కాలేజీలోనే ప్రేమ పెళ్లి.. యూత్​ ఫెస్టివల్​లో అంతా షాక్​

author img

By

Published : Feb 9, 2023, 6:08 PM IST

ప్రేమించుకున్న కాలేజీలోనే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పూర్వ విద్యార్థులు. కళాశాలలో జరిగిన యూత్​ ఫెస్టివల్​ సందర్భంగా వీరిద్దరు ఒక్కటయ్యారు. స్నేహితుల నడుమ ఉత్సహంగా దండలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం కేక్​ కోసి సంబరాలు జరుపుకున్నారు.

special wedding at Ernakulam Maharaja College in Kerala
దండలు మార్చుకుంటున్న కేకే నదీమ్​, సీఆర్​ కృపా

కాలేజీలోనే ప్రేమ పెళ్లి.. యూత్​ ఫెస్టివల్​లో అంతా షాక్​

కొన్నేళ్ల క్రితం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన ప్రదేశమే.. ఇప్పుడు వారి వివాహానికి వేదికైంది. కులమతాలకతీతంగా ప్రత్యేకంగా వారి పెళ్లి జరిగింది. కళాశాలలో కలిసిన వారి మనసులు.. అక్కడే వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. కాలేజీలో జరిగిన యూత్ ఫెస్టివల్​లో మరింత దగ్గరయ్యాయి. స్నేహితుల నడుమ దండలు మార్చుకున్న ఆ ప్రేమ జంట.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కేక్ కోసి సంబరాలు జరుపుకుంది.

తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించినట్పటికీ కళాశాల సాక్షిగా ఆ జంట ఏకమైంది. కేరళలోని ఎర్నాకులం మహారాజా కళాశాలలో ఈ ప్రత్యేక వివాహం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ సందర్భంగా ఓ ప్రేమ జంట ఇలా వినూత్నంగా పెళ్లి చేసుకుని.. వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. కేకే నదీమ్​ అనే యువకుడు, సీఆర్​ కృపా అనే యువతి ఇలా కళాశాలలో పత్యేకంగా పెళ్లి చేసుకున్నారు.

special wedding at Ernakulam Maharaja College in Kerala
దండలు మార్చుకుంటున్న కేకే నదీమ్​, సీఆర్​ కృపా

కేకే నదీమ్​, సీఆర్​ కృపా 2014-2017 మధ్య కాలంలో మహారాజా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నదీమ్​ మట్టంచెరికి చెందినవాడు కాగా.. కృపా పనంగాడ్​కు చెందిన అమ్మాయి. కేకే నదీమ్ బీఎస్సీ ఫిజిక్స్ చదివాడు. సీఆర్​ కృపా బీఏ ఫిలాసఫీ చదివింది. కాలేజీ రోజుల్లో వీరిద్దరు మంచి స్నేహితులు. కొద్ది రోజులు తరువాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చదువులు పూర్తి అయిన తరువాత కూడా వీరి ప్రేమ అలాగే కొనసాగింది.

ప్రేమ విషయాన్ని ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పారు. దీనికి ఇరువురి కుబుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఇవేవీ పట్టించుకోని ఆ ప్రేమికులు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వారు ప్రేమించుకున్న కాలేజీలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కళాశాలలో జరిగిన యూత్​ ఫెస్టివల్ ఒక్కటయ్యారు.​

special wedding at Ernakulam Maharaja College in Kerala
కళాశాలలో పెళ్లి చేసుకున్న కేకే నదీమ్​, సీఆర్​ కృపా

క్యాంపస్‌లో అలా చేయడం నిషిద్ధం..
కేరళలోని కోజికోడ్ ఎన్​ఐటీ క్యాంపస్‌లో ఆలింగనం చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివాటిని కాలేజీ యాజమాన్యం నిషేధించింది. దానికి సంబంధించి ఓ సర్కులర్​ను కూడా జారీ చేసింది. విద్యార్ధులందరికీ ఈ సందేశాన్ని ఈ మెయిళ్ల ద్వారా పంపింది. ఇతరుల పట్ల తమ ప్రేమను బాహాటంగా ప్రదర్శించడం వల్ల ఇతర విద్యార్థులకు, సిబ్బందికి ఇబ్బంది కలుగుతుందని క్యాంపస్​ డీన్​ రజినీకాంత్​ తెలిపారు. విద్యార్థుల చదువులపైనా ఇది ప్రభావం చూపిస్తోందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం ఈ సర్కు​లర్​ను జారీ కాగా ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Kozhikode NIT Campus in Kerala
కేరళలోని కోజికోడ్ ఎన్​ఐటీ క్యాంపస్‌
Kozhikode NIT Campus in Kerala
కాలేజి యాజమాన్యం జారీ చేసిన సర్క్​లర్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.