ETV Bharat / bharat

జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలు​ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..

author img

By

Published : Jul 20, 2022, 5:25 PM IST

Updated : Jul 20, 2022, 5:55 PM IST

JEE Main PostPoned: జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించింది నేషనల్​ టెస్టింగ్​ ఏజన్సీ. జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది.

Jee Main
Jee Main

JEE Main Second Session Post Pone: జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం.. జులై 21న మొదలై 30వ తేదీన ముగియాల్సి ఉండగా.. జులై 25న పరీక్షలు ప్రారంభమవుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది. అయితే ఈ వాయిదాకు గల కారణాన్ని మాత్రం చెప్పలేదు.

"జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలను జులై 25 నుంచి నిర్వహిస్తాం. మెత్తం 517 కేంద్రాల్లో 6.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన హాల్​ టికెట్లను.. గురువారం నుంచి అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయి."

-- నేషనల్​ టెస్టింగ్​ ఏజన్సీ

జేఈఈ మెయిన్​ మొదటి విడత పరీక్షలను ఎన్​టీఏ.. జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించింది. ఆ ఫలితాలను జులై 12న ప్రకటించింది.

ఇవీ చదవండి: సిద్ధూ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​.. ఇద్దరు మృతి

'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు

Last Updated : Jul 20, 2022, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.