ETV Bharat / bharat

'మై సెకండ్ వైఫ్' రెస్టారెంట్ యజమాని సూసైడ్​.. భార్యతో గొడవే కారణం!

author img

By

Published : Jan 6, 2023, 7:21 PM IST

My second wife restaurant owner
మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్ యజమాని

'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అనే పేరుతో హోటల్​ను ప్రారంభించి వార్తల్లోకెక్కిన రంజిత్ కుమార్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే అతడి బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

'మై సెకండ్​ వైఫ్ రెస్టారెంట్' అనే పేరుతో హోటల్​ను ప్రారంభించిన రంజిత్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బిహార్​లోని బాడ్​ పట్టణంలో వారం రోజుల కిందట జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..
తాను ప్రారంభించిన హోటల్​కు 'మై సెకండ్​ వైఫ్ రెస్టారెంట్' ​పేరు పెట్టడం వల్ల రంజిత్ కుమార్​ తన భార్యతో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై వీరి మధ్య తగాదా జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రంజిత్ తన ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ గది తలుపులు తెరవకపోవడం వల్ల కుటుంబీకులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గది తలుపులను పగలగొట్టి చూడగా రంజిత్ కుమార్​ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షకు తరలించారు. శవపరీక్ష పూర్తైన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్యతో గొడవల కారణంగా రంజిత్​ కుమార్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ఆర్థిక సమస్యల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ 'మై సైకండ్ వైఫ్ రెస్టారెంట్' కథ..
పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో 'మై సైకండ్ వైఫ్ రెస్టారెంట్' అనే హోటల్​ను గతేడాది అక్టోబరులో నెలకొల్పాడు రంజిత్. రోడ్డుపై వెళ్తున్నవారు ఈ విభిన్నమైన పేరును చూసి హోటల్​కు వస్తున్నారని అన్నాడు. హోటల్​లో టీ, బర్గర్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నట్లు రంజిత్ తెలిపాడు. రెస్టారెంట్​కు 'మై సెకండ్ వైఫ్' అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని అప్పట్లో చెప్పాడు రంజిత్. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని అన్నాడు.

"నా భార్య సుష్మా కుమారి కూడా ఇలాంటి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించింది. ఇద్దరు భార్యలు ఉండటం ఏంటని అడిగింది. కానీ, ఈ విషయంలో నా స్నేహితులు నా అభిప్రాయానికే ఓకే చెప్పాను. స్నేహితులు మరికొన్ని ఆకర్షణీయమైన పేర్లు సూచించారు. కానీ నేను ఇదే ఖరారు చేశా. దీంతో అక్టోబర్ నెలలో 'మై సెకండ్ వైఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్​'ను ప్రారంభించా."

--కొంతకాలం క్రితం రంజిత్ కుమార్​ చెప్పిన మాటలు

రెండో వివాహం చేసుకున్న మహిళకైనా, పురుషులకైనా.. మై సెకండ్ వైఫ్ ప్యామిలీ రెస్టారెంట్​లో డిస్కౌంట్ ఇస్తానని రంజిత్ అప్పట్లో చెప్పాడు. సాధారణంగా కస్టమర్లలో ఎవరికి రెండో వివాహం జరిగిందో తెలుసుకోవడం కష్టమే.. కానీ, ఎవరైనా రెండు వివాహాలు చేసుకున్నట్లు తెలిస్తే మాత్రం కచ్చితంగా వారికి డిస్కౌంట్ ఇస్తానని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.