ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

author img

By

Published : Aug 20, 2022, 9:50 AM IST

Updated : Aug 20, 2022, 1:05 PM IST

Mumbai Threat News Bombay Police Traffic Control Room has received a threat message to attack Mumbai

09:41 August 20

ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

Mumbai Threat News Bombay Police Traffic Control Room has received a threat message to attack Mumbai
పాక్​ నుంచి వచ్చిన బెదిరింపు సందేశం

Mumbai Threat News: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్లు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

"శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ ముంబయిలో ఉన్న కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్​లు వచ్చాయి. 26/11 తరహాలో ఉగ్రదాడి చేస్తామని బెదిరించారు. దీనిపై సిటీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు" అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఓ ఉగ్రవాది అరెస్ట్.. ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఓ అనుమానిత టెర్రరిస్ట్​ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్​ చేశారు.

60 గంటలపాటు సాగిన మారణ హోమం.. అది 2008 నవంబరు 26వ తేదీ.. రాత్రి 8 గంటలు సమయం.. ముంబయిలోని కొలాబా సముద్రతీరానికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో అక్కడకు చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.

ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు రద్దీగా ఉన్న ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి వద్ద ఉన్న ఏకే-47 తుపాకులు నిప్పులు కక్కాయి. ప్రజలపై తూటాల వర్షం కురిసింది. కన్పించిన వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని దాడికి ప్రజలు అల్లాడిపోయారు. భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అనేకమంది ప్రజలు క్షతగాత్రులయ్యారు.

Last Updated :Aug 20, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.