ETV Bharat / bharat

భర్తను వీడి ప్రియుడి ఇంటికి 'ఆమె'.. వివస్త్రను చేసి చితకబాదిన గ్రామస్థులు

author img

By

Published : Jul 4, 2022, 6:27 PM IST

Updated : Jul 4, 2022, 6:55 PM IST

మధ్యప్రదేశ్​లో ఓ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆమెను చితకబాదారు. కేరళ పాలక్కడ్​లో జరిగిన మరో ఘటనలో ఓ అన్న సొంతచెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బిడ్డకు జన్మనివ్వగా ఈ విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళ
మహిళ

ఆదివాసీ మహిళను చితకబాదిన స్థానికులు

వివాహేతర సంబంధం ఉన్న కారణంతో ఓ ఆదివాసీ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. భర్తను మహిళ భుజాలపై ఊరేగించిన జనం.. అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పులదండ వేసి చితకబాదారు. ఈ క్రమంలో బాధితురాలిని వివస్త్రను చేశారు స్థానికులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని దేవాస్​ జిల్లా బోర్పాడవ్ గ్రామంలో ఆదివారం జరిగింది.

ఇదీ జరిగింది: బాధితురాలు అదే గ్రామానికి చెందిన హరీ సింగ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే గత నెల 24న ఆమె ఇంటి నుంచి పరారై గుట్టుగా ప్రియుడి ఇంట్లో నివసిస్తోంది. భార్య కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త మంగీలాల్​.. గ్రామంలో కూడా ఆమె కోసం వెతికాడు. అనుమానం వచ్చి హరీ సింగ్ ఇంటికి వచ్చిన మంగీలాల్​.. ఓ గదిలో తలదాచుకుంటున్న భార్యను చూశాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని చితకబాదారు. బాధితురాలిని వివస్త్రను చేసిన దాడి చేశారు. హరీ సింగ్​ ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాధితులపై దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్​ చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

చెల్లిపై అత్యాచారం: చెల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్ననే పశువులా ప్రవర్తించాడు. ఓ 13 ఏళ్ల బాలికపై సొంత అన్ననే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కేరళలోని పాలక్కడ్​లో జరిగింది. బాలిక గతనెల బిడ్డకు జన్మనివ్వడం వల్ల అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ దారుణానికి ఒడిగట్టింది సోదరుడే అని తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భయంతోనే బాధితురాలు ఇన్నాళ్లు విషయాన్ని దాచిందని పోలీసులు తెలిపారు.

మైనర్​పై అత్యాచారం: 15 ఏళ్ల బాలికపై ఓ మైనర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గర్భం దాల్చగా తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. నిందితుడు బాధితురాలికి వరుసకు సోదరుడు అవుతాడని.. ప్రస్తుతం అతడు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆరేళ్ల బాలికపై..: ఈశాన్య దిల్లీలో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి ఆమెను అతని ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

భారీ దోపిడి: రాజస్థాన్​లోని భివాడీ జిల్లా అల్వార్​లో పట్టపగలే బ్యాంకును లూటీ చేశారు దుండగులు. యాక్సిస్​ బ్యాంకుకు గుర్తుతెలియని ఆరుగురు సాయుధులు వచ్చి రూ.70 లక్షలు దోచుకెళ్లారని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం సుమారు 10 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే వారిని అరెస్ట్​ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'దిశ' తరహాలో మరో కిరాతకం! యువతిని చంపి, నిప్పంటించి..

Last Updated : Jul 4, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.