ETV Bharat / bharat

ఫొటో స్టూడియోలో నకిలీ పాన్​కార్డుల తయారీ.. చివరకు

author img

By

Published : Nov 6, 2021, 12:57 PM IST

నకిలీ పాన్​కార్డ్​లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని (fake PAN card maker) మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 18 పాన్​కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

fake PAN card maker
నకిలీ పాన్ కార్డ్

మహారాష్ట్రలో నకిలీ పాన్​కార్డ్​లు సృష్టిస్తున్న ఓ వ్యక్తిని (fake PAN card maker) పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పాల్ఘర్ జిల్లా వాలివ్ ప్రాంతంలో జరిగింది.

జిల్లాలోని సాతివాలి గ్రామంలో సత్యప్రకాశ్ హిరలాల్ మౌర్య(29) ఓ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ షాప్​లోనే నకిలీ పాన్​ కార్డ్​లు (fake PAN card) తయారు చేసి విక్రయిస్తున్నాడు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. షాప్​పై దాడి చేశారు. ఈ క్రమంలో 18 నకిలీ పాన్​ కార్డ్​లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1000కి ఒక కార్డును నిందితుడు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్​టాప్​​, ప్రింటర్​, లామినేషన్ మెషిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:ఆయిల్ ట్యాంకర్​లో మంటలు- ఇద్దరు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.