ETV Bharat / bharat

భుజంపై మేనకోడలి మృతదేహం.. గుండెల నిండా దుఃఖం.. అంబులెన్స్​ లేక 5 కి.మీ. అలానే..

author img

By

Published : Jun 12, 2022, 12:28 PM IST

Updated : Jun 12, 2022, 1:31 PM IST

Man Carries Niece Deadbody On Shoulder: ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఓ వ్యక్తి తన నాలుగేళ్ల మేనకోడలి మృతదేహాన్ని భుజాలపై సుమారు 5 కి.మీ. మేర మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Man Carries Niece Deadbody On Shoulder
Man Carries Niece Deadbody On Shoulder

బాలిక మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న దృశ్యాలు

Man Carries Niece Deadbody On Shoulder: ఓవైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మాత్రం మనం ఎంత వెనకబడి ఉన్నామనేది తేటతెల్లం చేస్తున్నాయి. వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని చెబుతున్న నాయకులు.. కొన్నిచోట్ల కనీస సదుపాయాలను సైతం కల్పించలేకపోతున్నారు.

ఆసుపత్రిలో అంబులెన్స్​ అందుబాటులో లేక.. తన నాలుగేళ్ల మేనకోడలి మృతదేహాన్ని ఓ వ్యక్తి భుజాలపైనే 5 కిలోమీటర్లు మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. మధ్యప్రదేశ్​లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో కొద్దిరోజుల కిందట ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది.

Man Carries Niece Deadbody On Shoulder
శవాన్ని భుజంపై మోసుకెళ్తున్న దృశ్యం

ఛతర్‌పుర్​ జిల్లాలోని పౌడీ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బుక్స్‌వాహా హెల్త్​సెంటర్‌కు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడం వల్ల దామో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతతో ఆ బాలిక మృతిచెందింది. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం విజ్ఞప్తి చేసినా కనీసం ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక బాధితురాలి మేనమామ.. మృతదేహాన్ని దుప్పటితో కప్పి బస్సులో బుక్స్‌వాహాకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా వాహనం సమకూర్చమని అక్కడ అధికారుల దగ్గర మరోసారి మొరపెట్టుకున్నారు. అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడటం వల్ల జిల్లా సీఎంహెచ్‌ఓ స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి: డ్రైవర్​ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే!

వేధించిన యువకుడికి మహిళ చెప్పు దెబ్బలు.. అరగంట పాటు!

Last Updated :Jun 12, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.