ETV Bharat / bharat

ప్రేమకు నో చెప్పిందని ప్రియురాలి కుటుంబం దారుణ హత్య.. విషం తాగి యువకుడు సూసైడ్!

author img

By

Published : Apr 7, 2023, 3:28 PM IST

తన ప్రేమను నిరాకరించారని ప్రియురాలు సహా ఆమె కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు ఓ యువకుడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లి, తండ్రి, సోదరి మరణించారు. ఈ దారుణం బంగాల్​లో జరిగింది. మరోవైపు, ప్రేమను నిరాకరించిందని యువతిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ యువకుడు. అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

boyfriend kills girlfriend family
boyfriend kills girlfriend family

బంగాల్​లో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ప్రియురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను పదునైన ఆయుధంతో దాడి చేశాడు ఓ యువకుడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. ప్రస్తుతం నిందితుడి ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు, అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..
కూచ్ బెహర్​కు విభూతి భూషణ్​ అనే యువకుడు.. ఇతి బర్మన్ అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇతి బర్మన్​ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇతి కుటుంబసభ్యులపై నిందితుడు విభూతి భూషణ్​​ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ప్రియురాలు ఇతి బర్మన్​ ఇంటికి మరో ఇద్దరితో కలిసి గురువారం రాత్రి వెళ్లాడు. పదునైన ఆయుధంతో ఇతి బర్మన్​ కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇతి సహా ఆమె తండ్రి బిమల్ బర్మన్​, తల్లి నీలిమ, సోదరి రూనా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ స్థానికులు సీతల్​కుచి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన తర్వాత ఇతి మినహా ఆమె తల్లి, తండ్రి, సోదరి మరణించారు. ఇతి బర్మన్​ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇతి తల్లిదండ్రులిద్దరూ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. దీంతో ఒక్కసారిగా కుచ్​బెహర్​ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, టీఎంసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శీతలకూచి రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రేమకు నిరాకరించిందని దారుణం..
ప్రేమకు నిరాకరించిందని యువతిని కాల్చి చంపాడు ఓ యువకుడు. అనంతరం నిందితుడు అక్కడే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో జరిగింది.
నందిగ్రామ్‌కు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిందితుడి ప్రేమను యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు స్థానికంగా నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. గురువారం యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కాల్చాడు. అనంతరం తనతో తెచ్చుకున్న విషాన్ని తాగాడు. తుపాకీ శబ్ధం విన్న స్థానికులు వచ్చి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.