ETV Bharat / bharat

'నాన్నకు ప్రేమతో'.. లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె!

author img

By

Published : Nov 10, 2022, 2:21 PM IST

Lalu Yadav Kidney Transplant : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి జరగనుంది. లాలూకు సరిపోయే కిడ్నీని దానం చేయడానికి స్వయంగా తన రెండో కుమార్తె రోహిణీ ఆచార్యా ముందుకొచ్చారు. ఈ శస్త్ర చికిత్స కోసం త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లనున్నారు.

lalu daughter rohini kidney donate
lalu daughter rohini kidney donate

Lalu Yadav Kidney Transplant : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. రోహిణీ సింగపూర్‌లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్‌లో సింగపూర్‌ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఆపరేషన్‌ కోసం లాలూ నవంబర్‌ 20-24 మధ్య సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.

గత కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ఆయనకు కిడ్నీ మార్పిడిని సూచించలేదు. కానీ, తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందిన రోహిణి.. ఆయన్ను సింగపూర్‌లోని వైద్య బృందానికి చూపించింది. వారు లాలూకు కిడ్నీ మార్పిడి సూచించారు. లాలూ కిడ్నీ ఆపరేషన్‌ నవంబర్లో జరుగుతుందని ఆయన కుమారుడు, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం లాలూ దిల్లీలోని తన పెద్ద కుమార్తె మీసాభారతి ఇంట్లో ఉంటున్నారు.

ఇవీ చదవండి : క్రికెటర్ భార్యకు భాజపా టికెట్.. మోర్బీ బాధితుల్ని కాపాడిన వ్యక్తికి ఛాన్స్

Terrorism: భారత్​ లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. నదులే నావిగేటర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.