నెదర్లాండ్స్​లో మనోళ్ల ఇడ్లీ పిండి బిజినెస్​.. సూపర్​ హిట్​ లాభాలు!

author img

By

Published : Nov 18, 2022, 8:04 PM IST

Kerala couples business in Netherlands

కేరళకు చెందిన దంపతులు నెదర్లాండ్స్​లో దోశ, ఇడ్లీ పిండి అమ్ముతూ అదరగొడుతున్నారు. అక్కడి వారికి మన రుచులను పరిచయం చేస్తున్నారు. ఉద్యోగం కోసం వెళ్లిన వారు అక్కడి వారికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగి అందరి మన్ననలు పొందుతున్నారు.

కేరళ దంపతుల దోశ ఇడ్లీ పిండి బిజినెస్​

పరాయి దేశానికి ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయ జంట.. అక్కడివారికే ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగింది. మదర్స్​ కిచెన్​ అనే సంస్థను ప్రారంభించి విదేశీయులకు దక్షిణ భారత ప్రసిద్ధ వంటకాలైన ఇడ్లీ, దోశలను రుచి చూపిస్తున్నారు. ఆ దేశ సూపర్ మార్కెట్ల​లో దాదాపు 75 శాతం వీరి ఉత్పత్తులే ఉండటం గమనార్హం.

కేరళ ఎర్నాకులం జిల్లాకు చెందిన నవీన్, రమ్య వృత్తిరీత్యా ఐటీ నిపుణులు. 11 ఏళ్ల క్రితం ఉద్యోగానికై నెదర్లాండ్స్​​ వెళ్లారు. అందరిలాగే వాళ్లకూ మన దేశ వంటకాలను తినాలనిపించింది. ఇడ్లీ, దోశ కోసం చాల్ ప్రయత్నించారు. కానీ నెదర్లాండ్స్​లో ఎక్కడా వారికి ఆ వంటకాలు దొరకలేదు. ఆ సమస్యనే వారు అవకాశంగా మార్చుకున్నారు. సరికొత్త వ్యాపారం ప్రారంభించారు.

Kerala couples dosa Idli batter business
నవీన్, రమ్య

మదర్స్​ కిచెన్​ పేరుతో దోశ, ఇడ్లీ పిండిని తయారు చేసి దేశమంతా విక్రయిస్తున్నారు. మొదటగా సాధారణ గ్రైండింగ్​ మెషీన్​తో 10 కిలోల పిండిని తయారు చేసి అమ్మేవారు. రోజు రోజుకు డిమాండ్​ పెరుగుతూ వచ్చింది. దాంతో నవీన్​ ఉద్యోగం మానేసి 500 కిలోల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అధునాతన గ్రైండింగ్​ మెషీన్ కొన్నారు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా వ్యాపారాన్ని మరింత విస్తరించారు. నెదర్లాండ్స్​​ దేశమంతా మదర్స్​ కిచెన్ ఇడ్లీ, దోశ పిండి అమ్మే స్థాయికి ఎదిగారు.

Kerala couples dosa Idli batter business
దోశ, ఇడ్లీ పిండి

వారంలో మూడు రోజులు పిండిని తయారు చేస్తే తరువాతి రెండు రోజులు సూపర్​ మార్కెట్​లకు సరాఫరా చేస్తున్నారు. నవీన్​ భార్య రమ్య మాత్రం తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఖాళీ సమయాల్లో భర్తకు సాయం చేస్తుంటారు. మనం దేశంలో సైతం ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఆ దంపతులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.