ETV Bharat / bharat

800 ఏళ్ల నాటి శివాలయంలో మహిళలే అర్చకులు.. పది తరాలుగా ఘనంగా పూజలు!

author img

By

Published : Apr 30, 2023, 8:18 AM IST

Updated : Apr 30, 2023, 9:04 AM IST

మనం ఏ ఆలయానికి వెళ్లినా.. పురుష పూజారులే దర్శనమిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం మహిళలే.. వేద మంత్రోచ్ఛారణతో పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్వహణ చూసుకుంటున్నారు. దాదాపు 800 ఏళ్లుగా అక్కడ మహిళలే పూజలు చేస్తున్నారు. ఈ అరుదైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.

woman priest in kamnath mahadev mandir surat
woman priest in kamnath mahadev mandir surat

సాధారణంగా పురుష పండితులు మాత్రమే దేవాలయాల్లో పూజలు, మంత్రోచ్ఛారణ చేస్తుంటారు. ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. కానీ గుజారాత్​లోని సూరత్​లో ఉన్న ఓ దేవాలయం మాత్రం అందుకు విరుద్ధం. ఇక్కడ మహిళ పండితులే తరతరాలుగా ఆలయంలో పూజలు చేస్తున్నారు. దాదాపు 800 ఏళ్ల నాటి మహదేవ్​ ఆలయంలో మహిళలు వేదమంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన ఆలయంతో పాటు మహిళ పూజారుల గురించి తెలుసుకుందాం.

సూరత్​లోని కతర్​గామ్ ప్రాంతంలో దాదాపు పురాతన కాలం నాటి మహదేవ్​ ఆలయం ఉంది. ఈ ఆలయంలో పురుషులు.. కాకుండా మహిళలు పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది తరాలుగా ఇక్కడ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణను రక్షాబెన్​ గోస్వామీ(63) నిర్వహిస్తున్నారు. ఆమె కోడలు పూనమ్​ గోస్వామీ దేవుడికి వేద మంత్రోచ్ఛారణతో పూజలు చేస్తుంటారు.

kamnath mahadev mandir surat woman pandit
కామనాథ్​ ఆలయం, సూరత్​

ఈ ఆలయం గురించి చెప్పాలంటే.. ఇక్కడ సోమనాథ్​ మహదేవ్​, కామనాథ్​ మహదేవ్​ అని రెండు శివ లింగాలు దర్శనమిస్తాయి. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహిళా పూజారులు చేసే పూజలను భక్తులు కూడా ఎలాంటి బేధ భావం లేకుండా స్వీకరిస్తారు. అయితే రక్షాబెన్​ గోస్వామీ భర్త, కుమారుడు గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం అత్తాకోడళ్లు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.

woman priest in kamnath mahadev mandir surat
పూజలు చేస్తున్న మహిళలు

ఈ విషయంపై మహిళ పండితురాలు రక్షాబెన్​ మాట్లాడారు. "ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. నేను 42 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాను. మా అత్తగారి తరఫున నుంచి ఆలయ సేవను వారసత్వంగా పొందాను. ఇంతకు ముందు ఇక్కడ జనాభా ఎక్కువగా లేదు. ఇక్కడ ఒకే ఆలయం ఉండేది. అప్పట్లో మా అత్త ఈ గుడిలో పూజలు చేసేవారు. మేము పూజ చేస్తే ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారు. ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే పూజలు చేయడం ఆనవాయితీ" అని రక్షాబెన్​ తెలిపారు.

woman priest in kamnath mahadev mandir surat
పూజలు నిర్వహిస్తున్న రక్షాబెన్​ గోస్వామీ

"మహాదేవుని పూజించే హక్కు పురుషులకు మాత్రమే లేదు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలిగినప్పుడు.. మహాదేవ్​ను పూజించలేరా? పార్వతి మహాదేవ్​తో ఉంది. ప్రతి పురుషుడికి జన్మనిచ్చేది మహిళే" అని రక్షబెన్ వివరించారు​. గత పదేళ్లుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు భక్తురాలు భానుబెన్ పర్మార్ తెలిపారు. ఇక్కడ మహిళలే పూజ చేస్తారని.. ఆ పూజ ప్రాముఖ్యతను బాగా వివరిస్తారని భానుబెన్​ చెప్పారు.

Last Updated : Apr 30, 2023, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.