ETV Bharat / bharat

ఆదాయం లేని వ్యక్తికి కోటిన్నర పన్ను.. జీఎస్టీ అధికారుల నోటీసులు.. అంతా ఆధార్​, పాన్​తోనే..

author img

By

Published : Jan 5, 2023, 10:36 PM IST

నాలుగు వేలు కూడా ఆదాయం లేని సాధారణ వ్యక్తికి ఏకంగా కోటిన్నర రూపాయలు జీఎస్టీ కట్టమని నోటీసు అందింది. రాజస్థాన్​లోని జైసల్మేర్​లో జరిగిందీ ఘటన. తీరా ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటకొచ్చింది.

Jaisalmer man charged GST of more than Rs 1 crore
నారపత్రం

రాజస్థాన్​లోని జైసల్మేర్​కి చెందిన నారపత్రం ఒక సాధారణ వ్యక్తి. ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా కుటుంబం నుంచే నాలుగు వేలు తీసుకుంటున్న వ్యక్తికి ఏకంగా కోటికి పైగా పన్ను కట్టాలని నోటీసు వచ్చింది. పొరపాటున తెలియని వ్యక్తితో ఆధార్, పాన్ వివరాలను ఇచ్చాడు. ఆ వివరాలతో దుండగులు దిల్లీలో కంపనీని ఏర్పాటు చేశారు. కంపనీ టర్నోవర్ కోట్లకు పెరగడం వల్ల పన్ను కట్టమని నోటీసులు వచ్చాయి. తీరా ఏంటా అని ఆరాతీస్తే ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ జరిగింది:
రాజస్థాన్ జైసల్మేర్​​లోని రిద్వా గ్రామానికి చెందిన నారపత్రం ఒక సాధారణ వ్యక్తి. అనుకోకుండా ఒక రోజు తెలియని వ్యక్తికి తన ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇచ్చిన కొన్ని వారాల తర్వాత దాదాపుగా కోటిన్నర రూపాయలు జీఎస్టీ కట్టమని డిసెంబరు 22, 2022న నోటీసులు వచ్చాయి. తీరా ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తన ఆధార్, పాన్ కార్డు వివరాలతో తన పేరు మీద దిల్లీలో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపనీ కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ చేసింది. దానితో నేను పన్ను కట్దాలి అని నోటీసు వచ్చింది. మాదొక సాధారణ కుటుంబం. ప్రతినెలా నా కుటుంబమే నాలుగు వేలు నా అవసరాలకు ఇస్తుంది. కోటి రూపాయలకు పైగా పన్ను కట్టాలంటే మావల్ల కాదని చెప్పాడు. ఇలా జరిగిందని పోలీసు స్టేషనులో కంప్లయింట్ ఇవ్వటానికి వెళితే పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేదు..అని నారపత్రం చెప్పాడు. ఓటీపీ వచ్చినప్పుడు వచ్చిన ఫోన్​కాల్​ సంభాషణలు, ఓటీపీని చెప్పడం ఇవన్నీ ఒకసారి గుర్తుచేసుకున్నాను. నేను ఇచ్చిన నా వివరాల ఆధారంగా దిల్లీలో ఒక కంపనీని ప్రారంభించినట్లు నోటీసులో పేర్కోన్నారని చెప్పాడు.

"నోటీసు వచ్చినప్పుడు నాకు భాష అర్థం కాలేదు. తర్వాత వేరొకరితో చదివించినప్పుుడు అసలు విషయం తెలిసింది. నా ఆధార్, పాన్ వివరాలను తీసుకుని మోసగాళ్లు వాటి మీద ఒక కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. దీని వల్ల నాకు దాదాపుగా కోటిన్నర రూపాయలు జీఎస్టీ కట్టమని నోటీసులు వచ్చాయి"

"ఇలాంటి మోసాలను 'ఐటిసి క్రెడిట్‌ను మోసం చేయడం' అని అంటారు. నేరస్థులను పట్టుకుని వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఐటీసీ రికవరీ, ఆ కంపనీ మీద జరిమానాలు విధించిన తర్వాతనే దర్యాప్తు ముగుస్తుంది. ఇప్పుడు కట్టాల్సిన మొత్తం అంతిమం కాదు. ఇంకా విచారణలో తేలాల్సిన విషయాలు ఉన్నాయి."-సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్

ఇవీ చదవండి:

పెళ్లైన గంటకే భార్యకు విడాకులు.. తమ్ముడికి ఇచ్చి మరోసారి వివాహం

'రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టలేరు'.. ఉత్తరాఖండ్‌ మెగా కూల్చివేతలపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.