ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ముంబయిలో ఆరెంజ్ అలర్ట్​.. స్కూళ్లు బంద్​!

author img

By

Published : Jul 27, 2023, 12:07 PM IST

India Rain Today 2023 : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, శ్రీనగర్​లో ఎడతెరపిలేకుండా పడుతున్న వర్షాలు వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ముంబయిలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

India Rain Today 2023
India Rain Today 2023

India Rain Today 2023 : దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై నుంచి వరద ప్రవహిస్తోంది. జన జీవనం స్తంభించిపోయింది. అధికారులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

'అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు'
Mumbai Rains Today : ముంబయిలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరిందని అధికారులు తెలిపారు. ముంబయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. నాగ్‌పుర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నరేంద్రనగర్‌ అండర్‌ బ్రిడ్‌, ఎయిర్‌పోర్టు మార్గాల్లో భారీగా వరద ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ముంబయిలో ఆరెంట్ అలర్ట్​..
Mumbai Orange Alert Rain : గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు ముంబయిలో 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని హెచ్చరించారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో వాతవారణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

  • #WATCH | Maharashtra | Several areas of Nagpur city face waterlogging following overnight heavy rainfall. Narendra Nagar Railway Under Bridge (RuB) and Airport entry road are closed due to waterlogging.

    A resident, Gangadhar says, "There was heavy rainfall. There is… pic.twitter.com/BTdjkrFMrb

    — ANI (@ANI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు
Rain Update In Punjab : పంజాబ్‌ అమృత్‌సర్‌లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుండపోత వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • #WATCH | Maharastra: Severe rain lashes parts of Mumbai.

    'Orange' alert for heavy to very heavy rainfall was issued for the city for today.

    (Visuals from Wadi Bandar) pic.twitter.com/5x0BBRPO4u

    — ANI (@ANI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శ్రీనగర్​ జాతీయ రహదారిపైకి నీరు..
Srinagar Rain News : జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్‌ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు అప్రమత్తమై రహదారిపై ఉన్న వరద నీటిని తొలగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.