ETV Bharat / bharat

ఆగని కరోనా ఉద్ధృతి.. మరోసారి 18వేలకు పైనే కేసులు

author img

By

Published : Jul 9, 2022, 9:27 AM IST

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 18,840 మంది కొవిడ్ బారినపడ్డారు. 43 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

india covid cases reports
india covid cases reports

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 18,840 మంది వైరస్​ బారినపడగా.. మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,104 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.29 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 4.14 శాతానికి తగ్గింది.

  • మొత్తం మరణాలు: 5,25,386
  • యాక్టివ్​ కేసులు: 1,25,028
  • కోలుకున్నవారి సంఖ్య: 4,29,53,980

Vaccination India: భారత్​లో శుక్రవారం 12,26,795 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,65,36,288కు చేరింది. మరో 4,54,778 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,91,063 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,463 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,95,71,183కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,71,277 మంది మరణించారు. ఒక్కరోజే 4,87,206 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,26,40,181కు చేరింది.

  • ఫ్రాన్స్​లో 1,40,997 మంది వైరస్​ బారిన పడ్డారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికా​లో ఒక్కరోజే 1,07,777 మంది కొవిడ్​ బారినపడగా.. 303 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 1,00,690 మందికి వైరస్​ సోకగా.. 105 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో 72,551 కేసులు నమోదు కాగా.. 274 మంది మరణించారు.

ఇవీ చదవండి: యువతిపై ఐఎఫ్​ఎస్​ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!

లాలూకు మందుల ఓవర్​డోస్.. సింగపూర్​ తరలింపు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.