లాలూకు మందుల ఓవర్​డోస్.. సింగపూర్​ తరలింపు కష్టమే!

author img

By

Published : Jul 7, 2022, 10:07 PM IST

Lalu yadav health

Lalu yadav health: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. మందులు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించారు.

Lalu yadav health: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మందులు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్​ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు బుధవారం రాత్రి ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీ ఎయిమ్స్​కు తరలించారు. అయితే, లాలూ శరీరంలో కదలికలు లేవని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటే సింగపూర్​కు తరలించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడం వల్ల మరో రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.

''మెరుగైన చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్​కు తీసుకువచ్చాం. ఇక్కడి వైద్యులకు ఆయన పూర్తి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన ఉంది. ప్రస్తుతానికి ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. మూడు ఎముకలు విరగడం, మందులు అధికంగా అందించడం వల్ల చికిత్స అందించడం సమస్యగా మారింది.''

-తేజస్వీ యాదవ్​, లాలు ప్రసాద్​ యాదవ్ కుమారుడు

సింగపూర్​కు లాలూ!: లాలూ పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇదివరకే తేజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం గత నెలలోనే జార్ఖండ్ హైకోర్టు నుంచి లాలూ అనుమతి తీసుకున్నారు. లాలూ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు దిల్లీ ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

జారిపడిన గాయాలతో పాటు ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు లాలూ. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ లాలూ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్.. లాలూ పట్నాలోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: 'లాలూ శరీరంలో కదలికలు లేవు.. చెకప్ అయ్యాక దానిపై నిర్ణయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.