ETV Bharat / bharat

ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. 3.27కేజీల వజ్రాలు సీజ్.. బ్యాగులో బంగారం తరలిస్తూ..

author img

By

Published : Nov 4, 2022, 8:22 PM IST

ఆ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద పలు నిఘా బృందాలు, పారా మిలటరీ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని వాహనాలపై అధికారులు 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారు. అయితే ఈ సోదాలో భాగంగా 3.27 కిలోల వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

diamonds and money
డైమండ్స్, నగదు

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్​ప్రదేశ్​లో పోలీసులు భారీ స్థాయిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హరియాణా సరిహద్దు ప్రాంతంలో హిమాచల్ పోలీసులు గురువారం అర్థరాత్రి బెహ్రాల్ చెక్‌పోస్టు వద్ద కారులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 1.6 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి నుంచి 3.27 కిలోల వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి రూ.9,35,000 జరిమానా విధించారు.

diamonds
డైమండ్స్, నగలు
money
నగదు

అధికారులు జప్తు చేసిన నగలన్నీ రాష్ట్ర పన్ను, ఎక్సైజ్ శాఖకు ఇచ్చినట్లు డీఎస్పీ రమాకాంత్‌కు తెలిపారు. జప్తు తర్వాత, పాంటా సాహిబ్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో సమాచారాన్ని పంచుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసి డ్రైవర్​ను ప్రశ్నిస్తున్నారు. గడిచిన 10 రోజుల్లో, పవోంటా సాహిబ్‌లోని గోవింద్‌ఘాట్, బెహ్రాల్ చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన సోదాల్లో పోలీసులు రూ.30 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద పలు నిఘా బృందాలు, పారా మిలటరీ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని వాహనాలపై అధికారులు 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులపైనా పోలీసు నిఘా పెట్టారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల నుంచి హిమాచల్‌కు మద్యం, డబ్బు, డ్రగ్స్ రవాణా కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

బ్యాగు లైనింగ్​లో బంగారం...
మరోవైపు.. బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. కొలంబో నుంచి వస్తున్న ఓ వ్యక్తి ట్రాలీ సూట్‌కేస్ బయటి లైనింగ్‌లో దాచిన రూ.46.24 లక్షల విలువైన 1038 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బంగారం
బంగారం
gold
బంగారం

ఇవీ చదవండి:మృత్యువుకు ముచ్చెమటలు.. వంతెన ప్రమాదంలో చిన్నారి సేఫ్.. తల్లిదండ్రులు మాత్రం..

తల్లిదండ్రులు, పిల్లలకు మత్తుమందు ఇచ్చి, వాటర్ ట్యాంక్​లో తోసి హత్య.. అనంతరం ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.