ETV Bharat / bharat

మృత్యువుకు ముచ్చెమటలు.. వంతెన ప్రమాదంలో చిన్నారి సేఫ్.. తల్లిదండ్రులు మాత్రం..

author img

By

Published : Nov 4, 2022, 5:08 PM IST

గుజరాత్​ మోర్బీ దుర్ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రిటిష్​ కాలం నాటి తీగల వంతెన కూలి 135 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘోర విషాదం నుంచి ఏడేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, మృత్యువును జయించినా.. తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది బాలిక హర్షి.

Morbi tragedy
Morbi tragedy

మోర్బీ ఘటన మృత్యుంజయురాలు

సెలవురోజు సరదాగా గడుపుదామని వచ్చిన వారి ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. గుజరాత్​లో బ్రిటిష్ కాలంనాటి వంతెన కూలి.. 135 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఎన్నో కుటుంబాలకు తీరని దుఃఖం మిగిల్చింది ఈ మోర్బీ దుర్ఘటన. అందులో హర్షి అనే ఏడేళ్ల బాలిక చావుకు ఎదురెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. కానీ తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథయ్యింది.

ఆదివారం కావడం వల్ల ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి మోర్బీ వంతెన వద్దకు భారీగా పర్యాటకులు వచ్చారు. దీంతో వంతెనపై సందడి వాతావరణం నెలకొంది. అందరూ ప్రకృతి సోయగానికి మంత్రముగ్ధులు అయిపోతున్నారు. ఇంతలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. వంతెనపై వందల మంది నదిలో పడిపోయారు. ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అనేక కుటుంబాలు కకావికలం అయ్యాయి.

అయితే.. ఇంతటి పెను విపత్తులోనూ మృత్యువును జయించింది అహ్మదాబాద్​కు చెందిన హర్షి అనే ఏడేళ్ల బాలిక. ఒక్కొక్కరి ప్రాణాలను నది మింగేస్తున్న వేళ.. తెగిపడిన వంతెన తాడును గట్టిగా పట్టుకుంది చిన్నారి. ఒంట్లో ఒక్కొక్క అణువును ఏకం చేసుకొని మృత్యువుకే ముచ్చెమటలు పట్టించింది. చావును జయించింది. కానీ అదే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. అమ్మనాన్న ఎక్కడ అని అమాయకంగా అడుగుతున్న హర్షి పరిస్థితి.. అందరి హృదయాలను కలచివేస్తోంది.

తల్లిదండ్రులను కోల్పోయిన హర్షికి.. తాత జేసంగ్ ​భాయ్​ చవ్దా ఏకైక దిక్కయ్యారు. ఇప్పుడు చిన్నారి హర్షి భారం మొత్తం ఆయనపైనే పడింది. సంపాదించే కుమారుడు చనిపోవడం వల్ల పోషించే స్తోమత లేక.. ప్రభుత్వ సహకారం వైపు చూస్తున్నారు జేసంగ్​ భాయ్​. ప్రస్తుతం హర్షి.. శారద విద్యామందిర్​లో చదువుతోంది. ఆమెకు ఎదురైన పరిస్థితిని చూసి వారు చలించిపోయారు. ఎనిమిదో తరగతి వరకు హర్షి విద్యకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి : తల్లిదండ్రులు, పిల్లలకు మత్తుమందు ఇచ్చి, వాటర్ ట్యాంక్​లో తోసి హత్య.. అనంతరం ఆత్మహత్య

'భాజపాకు ఓటు వేయలేదని ఎస్​సీ బాలిక స్కూల్​కు రాకుండా అడ్డగింత!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.