ETV Bharat / bharat

తల్లిదండ్రులు, పిల్లలకు మత్తుమందు ఇచ్చి, వాటర్ ట్యాంక్​లో తోసి హత్య.. అనంతరం ఆత్మహత్య

author img

By

Published : Nov 4, 2022, 1:51 PM IST

ఓ వ్యక్తి తన తల్లిదండ్రులకు, ఇద్దరు కుమారులకు నిద్రమాత్రలు ఇచ్చి వాటర్ ట్యాంక్​లో పడేసి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ​ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

man suicide along with family
కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి

రాజస్థాన్ జోధ్‌పుర్‌లో జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను, ఇద్దరు కుమారులను చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. లోహవట్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్వా గ్రామ సమీపంలో శంకర్ బిష్ణోయ్ అనే వ్యక్తి తన కుటుంబంలోని నలుగురికి నిద్రమాత్రలు ఇచ్చాడు. దాంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం వారందరినీ వాటర్ ట్యాంక్​లో పడేసి చంపేశాడు. తరువాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

"ఈ ఘటనలో అందరూ చనిపోయారు. గురువారం అర్ధరాత్రి శంకర్ తన భార్యను, ఇతర కుటుంబ సభ్యులను ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను, ఇద్దరు కుమారులను చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున మాకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం." అని రూరల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిల్‌ కయాల్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.