ETV Bharat / bharat

Chandrababu Bail Petition : అంగళ్లు ఘటన.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 11:35 AM IST

Updated : Sep 14, 2023, 12:15 PM IST

Chandrababu_Bail_Petition
Chandrababu_Bail_Petition

11:31 September 14

కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు

Chandrababu Bail Petition :అంగళ్లు ఘటనలో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేయగా.. కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆగస్టు 4న నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద టీడీపీ - వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అంగళ్లు వద్ద అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని చంద్రబాబు పిటిషన్‌ వేసిన బాబు.. తనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ (Chandrababu anticipatory bail) కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

Somireddy Chandramohan Reddy Fire on police: 'ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి.. జగన్ పార్టీ భూస్థాపితం ఖాయం'

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆగస్టు 4న తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అంగళ్లు వద్ద అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. అంగళ్లులో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు... రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డాయి. పుంగనూరు (Punganur) వద్ద రహదారిపై లారీని అడ్డు పెట్టి.. నిలవరించే ప్రయత్నం చేశాయి. మరోవైపు పోలీసులు.. పుంగనూరు వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఓ వైపు వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం, మరోవైపు పోలీసులు సైతం చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. వైసీపీ శ్రేణులు రాళ్లు విసరడంతో చాలా మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. తెలుగుదేశం (Telugudesam)ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించివేయడంతో.. ఉద్రిక్తతత నెలకొంది.

TDP Leader Challa Ramachandra Reddy Surrendered: పోలీసుల ఎదుట లొంగిపోయిన చల్లా రామచంద్రారెడ్డి

చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వైసీపీ నేతల చేసిన దాష్టీకంపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన ప్రతిపక్ష నేత పర్యటనలో ఇలా జరగడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం గొంతు నొక్కేలా జగన్ సర్కారు(Jagan Govt) వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పుంగనూరు ఘటనను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అంగళ్లులో బాబుపై దాడి ఘటనను ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి... ప్రతిపక్ష నేత పర్యటనలో జరిగిన సంఘటన శోచనీయం అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ (Chandrababu Naidu convoy)​పై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు పర్యటన మార్గంలో ప్రధాన రహదారిపై కంటైనర్ లారీ, వాహనాలను అడ్డుపెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూడడం పోలీసులు విపరీత చర్యలకు తార్కాణమని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

TDP Leaders Fires on Police Cases: "యువగళం పాదయాత్రలో ఉన్నవారిపై.. అంగళ్లు ఘటనలో రాళ్లు వేశారని కేసా"

Last Updated : Sep 14, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.