ETV Bharat / bharat

Devi Navratris 2023 What To Wear : దేవీ నవరాత్రులు.. తొమ్మిది రోజులు 9 వస్త్రాలు ధరించాలి.. అవేంటో మీకు తెలుసా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 4:27 PM IST

Devi Navratris 2023 What To Wear and Pooja Schedules To Follow in telugu : ఈ ఏడాది శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం అనవాయితీ. అయితే పూజా సమయంలో భక్తులు ఏ రోజుకారోజు ప్రత్యేకమైన రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం. మరి, ఏ రంగు బట్టలను ఎప్పుడు ధరించాలో ఇప్పుడు చూద్దాం..

Devi Navratris 2023 What To Wear
Devi Navratris 2023 What To Wear

Devi Navratris 2023 What To Wear and Pooja Schedules To Follow in telugu : దేశమంతటా నవరాత్రి ఉత్సవాల వాతావరణం అలుముకుంటోంది. దేవీ ఉత్సవాల ఘనంగా నిర్వహించేందుకు భక్తజనం సిద్ధమవుతున్నారు. అమ్మవారిని ఆరాధించడానికి ఈ శరన్నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు ఈ సమయంలో పూర్తి ఆచార వ్యవహారాలతో, నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవిని హృదయపూర్వకంగా ఆరాధించే భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. ఈ ప్రత్యేక రోజుల్లో(Navratris 2023) అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే జగన్మాతను.. తొమ్మిది రోజులు ఏ రూపంలో కొలవాలి..? పూజా సమయంలో ఏ రంగు దుస్తువులు ధరించాలి? మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Sharad Navratris 2023 : ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి ఉత్సవాలు(Shardiya Navratris 2023) అక్టోబర్ 15, ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24, మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు దేవీ శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్నాయి. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవీని తొమ్మిది వేర్వేరు రూపాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చాలా మంది భక్తులు దుర్గా దేవిని పూజిస్తూ అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అలాగే ఈ కాలంలో ఉపవాసం కూడా ఉంటారు. అదేవిధంగా నవరాత్రి పూజల సమయంలో 9 రోజులు తొమ్మిది రంగుల వస్త్రాలు ధరించి అమ్మవారి కొలుస్తే మరిన్ని శుభ ఫలితాలు చేకూరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇంతకీ ఏయే రోజు ఏ ఏ రంగు దుస్తువులు ధరించాలో ఇప్పుడు చూద్దాం..

Navratri 2023 Shubh Muhurat : ఈసారి దేవీ నవరాత్రులు ఎప్పుడొచ్చాయి.. ఏ రోజు ఏ పూజాకార్యక్రమం నిర్వహించాలంటే..

Which Colour Clothes to Wear During Navratris 2023 Nine Days :

నవరాత్రి 2023 తొమ్మిది రోజులలో ఎలాంటి రంగుల బట్టలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటి రోజు : నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి దేవిగా పూజిస్తారు. శైలపుత్రి దేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల.. ఈ రోజు పసుపు ధరించడం అదృష్టమని చెబుతుంటారు. పసుపు వర్ణం అదృష్టం, ఆనందాన్ని తీసుకొస్తుంది.

రెండో రోజు : నవరాత్రి రెండో రోజున దుర్గాదేవిని దేవి బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఆకుపచ్చ రంగు ఈ అమ్మవారికి అత్యంత ఇష్టం. కాబట్టి రెండో రోజున ఆకుపచ్చని వస్త్రాలను ధరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

మూడో రోజు : మూడో రోజు చంద్రఘంటా దేవి దుర్గాదేవిగా భావిస్తూ ఆమెను పూజిస్తారు. ఈ రోజు బ్రౌన్ కలర్ దుస్తులు ధరించడం అదృష్టంగా భక్తులు భావిస్తారు.

నాలుగో రోజు : నవరాత్రి నాలుగో రోజున అమ్మవారిని దేవి కూష్మాండ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించి కూష్మాండ దేవిని పూజించాలని చెబుతారు. ఈ రంగు ప్రకాశం, జ్ఞానం, ప్రశాంతతను సూచిస్తుంది.

ఐదో రోజు : నవరాత్రులలో భాగంగా ఐదో రోజున స్కంధమాతా దేవిగా పూజిస్తారు. ఈ రోజు పూజ చేసేటప్పుడు తెల్లని దుస్తులు ధరించాలి. ఎందుకంటే.. తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది.

ఆరో రోజు : ఆరో రోజు దుర్గాదేవిని కాత్యాయనీ దేవిగా పూజిస్తారు. కాత్యాయని దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల. ఈ రోజున భక్తులు ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించి దీవెనలు పొందాలి.

ఏడో రోజు : నవరాత్రులలో ఏడో రోజు దేవి కాలరాత్రినిగా పూజిస్తారు. ఈ రోజున భక్తులు మా కాళరాత్రిని పూజించడానికి నీలం రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.

ఎనిమిదో రోజు : నవరాత్రుల ముఖ్యమైన రోజులలో అష్టమి ఒకటి. దుర్గాదేవి ఎనిమిదో రూపమైన మహాగౌరిని ఈ రోజున పూజిస్తారు. భక్తులు అమ్మవారిని ఆరాధించేటప్పుడు నిగూఢమైన గులాబీ రంగు దుస్తులను ధరించాలి. ఇది ఆశ, స్వీయ-శుద్ధి, సామాజిక ఉద్ధరణను సూచిస్తుంది.

తొమ్మిదో రోజు : నవరాత్రులలో చివరిరోజైన తొమ్మిదో రోజు అమ్మవారి తొమ్మిదో రూపం సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. సకల సిద్ధుల పుత్రిక అయిన సిద్ధిదాత్రి పూజకు విశిష్టమైన విశిష్టత ఉంది. ఈ రోజున ఊదా రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

Kolkata Durga Puja Special Tramway : కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజ థీమ్​తో స్పెషల్​ డిజైన్​

మనస్సంకల్పానికి ప్రతీక.. మానసాదేవి అమ్మవారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.