ETV Bharat / bharat

నాలుగు నోట్​బుక్స్​లో​ రూ.40లక్షలు తెచ్చిన ఘనుడు.. ఎలా సాధ్యం?

author img

By

Published : May 31, 2022, 12:50 PM IST

airport smuggling news: అక్రమంగా విదేశీ నగదును నోట్​బుక్స్​లో​ తరలిస్తున్న వ్యక్తిని దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువ గల విదేశీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

airport smuggling news:
అట్టలో దాచిన నగదు

airport smuggling news: దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ నగదును సీఐఎస్​ఎఫ్​, నిఘా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్​కు వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రూ.40 లక్షల విలువగల విదేశీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రూ.2లక్షల సౌదీ రియల్స్​, 200 అమెరికా డాలర్స్, 170 దిర్హమ్స్​ను నోట్​బుక్స్​ మధ్యలో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల మహ్మద్​ హరున్​గా గుర్తించారు.

airport smuggling news:
అట్టలో దాచిన నగదు
airport smuggling news:
అట్టలో దాచిన నగదు

"నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండడం వల్ల అనుమానం వచ్చి అతడి లగేజీని తనిఖీ చేశాం. దాంతో నాలుగు నోట్​బుక్స్​ అట్టల మధ్యలో పెట్టిన నగదును గుర్తించాం. పట్టుబడిన నగదుకు సంబంధించి అతడు సరైన పత్రాలు చూపించలేదు."

-సీఐఎస్​ఎఫ్​ అధికారులు

ఇదీ చదవండి: 'కశ్మీరీ పండిట్'​ టీచర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.