ETV Bharat / bharat

'దేశ ప్రజలను విద్వేషాలతో విడగొడుతున్నారు'.. కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకల్లో ఖర్గే

author img

By

Published : Dec 28, 2022, 12:18 PM IST

Congress Foundation Day : దేశ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా విద్వేషాలను రాజేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

congress foundation day
congress foundation day

Congress Foundation Day : భాజపా ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. దేశ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా విద్వేషాలు రాజేసి, విడగొడుతోందని విమర్శించారు. కాంగ్రెస్​ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ సహా సీనియర్ నేతల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

congress foundation day
జెండా ఎగురవేసిన జాతీయ అధ్యక్షుడు ఖర్గే

భారత్​ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదని.. కొన్ని దశాబ్దాలలోనే ఆర్థిక, అణు, రక్షణ రంగాల్లో సూపర్​ పవర్​గా మారుతోందని అశాభావం వ్యక్తం చేశారు ఖర్గే. దళితులు, పేదల సంకెళ్లను తెంచడం కోసం కాంగ్రెస్​ ఎంతో పోరాటం చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండేందుకు మాజీ ప్రధాని నెహ్రూ ఐదుగురు కాంగ్రెస్సేతర మంత్రులను కేబినెట్​లోకి తీసుకున్నారని గుర్తు చేశారు.

congress foundation day
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ

టీ షర్ట్ చల్​ రహీ హై
భారత్​ జోడో యాత్రలో విరామం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు. ఆయన టీ షర్ట్​పై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి అదే వస్త్రధారణలో దర్శనమిచ్చారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతం టీ షర్ట్​ నడుస్తోంది.. నడుస్తున్నని రోజులు నడవనీయండంటూ సమాధానమిచ్చారు.

congress foundation day
పాల్గొన్న నేతలు, కార్యకర్తలు

ఇవీ చదవండి: విడాకులు మంజూరైన వెంటనే భర్తను కోర్టులోనే చితకబాదిన భార్య బంధువులు

కార్మికుడి ఛాతిలోకి దిగిన ఐరన్​ రాడ్​.. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి దూసుకొచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.