ETV Bharat / bharat

ఎన్​ఐఏ భారీ ఆపరేషన్.. ఒకేసారి 45 చోట్ల సోదాలు.. టార్గెట్​ వారే!

author img

By

Published : Nov 10, 2022, 10:30 AM IST

Updated : Nov 10, 2022, 11:27 AM IST

Coimbatore Car Blast Case
Coimbatore Car Blast Case

Coimbatore Car Blast Case : కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో జాతీయ దర్యూప్తు సంస్థ భారీ ఆపరేషన్​ చేపట్టింది. తమిళనాడువ్యాప్తంగా సోదాలు నిర్వహించింది.

Coimbatore Car Blast Case : తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం భారీ ఆపరేషన్ చేపట్టింది. కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసులో రాష్ట్రంలోని దాదాపు 45 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. కోయంబత్తూరులోనే 21 ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేశారు. రాష్ట్ర పోలీసుల సహాయంతో నిందితుల నివాస గృహాల వద్ద తనిఖీలు చేశారు. కోయంబత్తూరులోని కొత్తమేడు, పొన్విజా నగర్, రాథినపురి, ఉక్కడం లాంటి ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.

అక్టోబర్​ 23న ఉక్కడంలో కారులోని సిలిండర్​ పేలి జమేషా ముబీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎన్​ఐఏ దర్యాప్తునకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. హోంశాఖ ఆదేశాలతో 15 రోజుల క్రితం కేసు నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. గురువారం భారీ స్థాయిలో సోదాలు జరిపింది.

అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మొహ్మద్‌ తల్కా, మొహ్మద్‌ అజారుద్దీన్‌, మొహ్మద్‌ రియాజ్‌, ఫిరోజ్‌ ఇస్మాయిల్‌, మొహ్మద్‌ నివాజ్‌ ఇస్మాయిల్‌తో పాటు.. ముబీన్​ బంధువైన అఫ్సర్ ఖాన్ ఉన్నాడు. వీరిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం-ఉపా కింద కేసు నమోదు చేశారు.

కారు పేలుడు ఘటన అనంతరం ముబీన్ ఇంట్లో సోదాలు చేయగా.. పొటాషియం నైట్రేట్, చార్​కోల్, అల్యూమినియం పొడి, సల్ఫర్​ లాంటివి లభ్యమైనట్లు చెప్పారు. వీటితో పేలుడు పదార్థాలు తయారు చేయొచ్చని తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ముబీన్​ను.. 2019లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్​ఐఏ అధికారులు విచారించడం గమనార్హం.

ఇవీ చదవండి : Terrorism: భారత్​ లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. నదులే నావిగేటర్లు!

వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్​ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి

Last Updated :Nov 10, 2022, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.