ETV Bharat / bharat

పర్యటకులకు సైకత శిల్పంతో 'సుదర్శన' సందేశం

author img

By

Published : Sep 27, 2020, 12:31 PM IST

ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. కరోనా నేపథ్యంలో పర్యటకాన్ని ఆస్వాదిస్తూనే నిబంధనలు పాటించాలని కోరారు.

Odisha's sudarshan pattnaik creates sand Art to promote World tourism
ప్రపంచ పర్యటక దినోత్సవంపై సైకత శిల్పం

ప్రపంచ పర్యటక దినోత్సవ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరి తీరంలో ఏర్పాటు చేసిన ఈ సైకత కళాఖండంతో అద్వితీయమైన సందేశమిచ్చారు. కరోనా నేపథ్యంలో పర్యటకాన్ని ఆస్వాదిస్తూనే నిబంధనలు పాటించాలని కోరారు.

Odisha's sudarshan pattnaik creates sand Art to promote World tourism
పర్యటక దినోత్సవంపై సైకత శిల్పం

ప్రపంచంలోని అద్భుత వింతలతో పాటు ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలను సైకత శిల్పంపై ఏర్పాటు చేశారు సుదర్శన్ పట్నాయక్. తాజ్ మహల్, ఈఫిల్ టవర్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, పీసా టవర్ సహా ప్రఖ్యాత కట్టడాలను ఇసుకతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు.

Odisha's sudarshan pattnaik creates sand Art to promote World tourism
పర్యటక దినోత్సవంపై సైకత శిల్పం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.