ETV Bharat / bharat

అగ్నివీర్​గా ఆటోడ్రైవర్​ కూతురు.. రాష్ట్రం తరఫున తొలి యువతిగా గుర్తింపు!

author img

By

Published : Jan 7, 2023, 1:42 PM IST

ఆటో డ్రైవర్​ కుమార్తె.. అగ్నివీర్ పథకం కింద సైన్యానికి ఎంపికైంది. రాష్ట్రంలో మొదటి మహిళా అగ్నివీర్​గా గుర్తింపు పొందింది!. కాన్సర్​తో బాధపడుతున్నఆమె తండ్రి ఎంతో కష్టపడి కుమార్తెను చదివించాడు.

auto-drivers-daughter-becmae-chhattisgarh-first-woman-agniveer
ఛత్తీస్‌గఢ్ మొదటి మహిళ అగ్నివీర్ హిషా బఘేల్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్​ పథకం కింద ఆటో డ్రైవర్​ కుమార్తె.. సైన్యంలో చోటు సంపాదించింది. ఛత్తీస్‌గఢ్​ నుంచి అగ్నివీర్​ ద్వారా సైన్యంలో చేరే మొదటి యువతిగా ఆమె నిలిచింది. దుర్గ్ జిల్లాలో నివాసం ఉండే హిషా బఘేల్ అనే యువతి.. సైన్యానికి ఎంపికై తన కోరికను నేరవేర్చుకుంది. హిషా సైన్యంలో చోటు సంపాదించడం పట్ల ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్​లో అగ్నివీర్ పథకం కింద నేవీ రిక్రూట్‌మెంట్ కోసం హిషా దరఖాస్తు చేసింది. ఆమెకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. హిషాను సైన్యంలోకి తీసుకున్నారు. మార్చి వరకు ఒడిశాలోని శిక్షణ తీసుకోనుంది హిషా. శిక్షణ అనంతరం ఆమె సైన్యంలో చేరనుంది. "నా కుమార్తె హిషా.. మా గ్రామ మైదానంలోనే యువకులతో కలిసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది. నా భర్త 12 ఏళ్లుగా కాన్సర్​తో బాధ పడుతున్నారు. కానీ పొలం, ఆటో అమ్మి పిల్లలను చదివించాడు." అని హిషా తల్లి తెలిపింది. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే కోరిక ఉండేదని హిషా బఘేల్ ఈటీవీ భారత్​తో చెప్పింది.

అగ్నివీర్ పథకం కింద భారత నౌకాదళంలో మొత్తం 560 మహిళ సైనికుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ అయింది​. మొదటి దశలో 200 మంది మహిళలు ఎంపికయ్యారు. ఇందులో హిషా బాఘేల్.. మెరిట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా మొదటి మహిళా అగ్నివీర్‌గా ఎంపికైంది. మొదటి నుంచి హిషా బఘేల్ చదువుల్లో, ఆటల్లో ముందుడేదని ఆమెకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.