ETV Bharat / bharat

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 7:26 AM IST

Updated : Sep 10, 2023, 10:54 AM IST

Ajeyakalam Approved the Siemens Project : నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టును ఆమోదించడం, బడ్జెట్‌ కేటాయించడంలో అజేయకల్లం, ప్రేమ్‌చంద్రారెడ్డిదే కీలక పాత్రని.. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్‌ పేర్కొన్నారు. అది సక్రమంగా ఉందో లేదో సమగ్రంగా పరిశీలించాల్సింది.. అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిదేనన్నారు. సీఐడీ గతంలో తనకు ఇచ్చిన లిఖిత పూర్వక ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

Ajeyakalam Approved the Siemens Project
Ajeyakalam Approved the Siemens Project

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

Ajeyakalam Approved the Siemens Project : ‘‘ఒక ప్రాజెక్టు ఆమోదించడం, బడ్జెట్‌ కేటాయించడం కంటే ముందే అది సక్రమంగా ఉందో లేదో సమగ్రంగా పరిశీలించాలని. సీమెన్సు ప్రాజెక్టును (Siemens Project) ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆమోదించింది అప్పటి అధికారి అజేయకల్లామేనని.. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం సరిగా అమలు జరిగేలా చూడాల్సింది నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డేనన్నారు. నిధుల విడుదల సమయంలోనూ బాధ్యత ఆ శాఖదేనని పేర్కొన్నారు. సీమెన్స్‌తో ఒప్పందం, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు ప్రాజెక్టుకు సంబంధించి సీఐడీ అధికారులు విచారణ క్రమంలో గతంలో ఆయనకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

Chief Secretary of the Finance Department PV Ramesh Comments on Siemens Project: నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతా నుంచి రెండు విడతల్లో 300 కోట్లు ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించడానికి ముందు మీరు సంతృప్తి చెందారా అని సీఐడీ ప్రశ్నించింది. ఆర్థిక కార్యదర్శి సమక్షంలో డిజైన్‌ టెక్‌ డైరెక్టర్‌తో జరిగిన చర్చలపైనా ప్రశ్నలు అడిగింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా అయిదేళ్లు పని చేసిన సమయంలో తాను ఒక బాహ్య సంస్థను కలవడం అసాధారణమని పీవీ రమేశ్‌ బదులిచ్చారు. నైపుణ్యాభివృధ్ధి సంస్థ అధికారులు, ఆర్థికశాఖ కార్యదర్శి సమక్షంలో డిజైన్‌ టెక్‌ డైరెక్టర్‌తో సమావేశం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత పొందేందుకు, సంబంధిత శాఖ పూర్తి సమాచారం అందించలేని పరిస్థితుల్లోనే వారితో సమావేశమైనట్లు బదులిచ్చారు. తాను సిఫార్సు చేసిన అన్ని అంశాలను సంపూర్ణంగా అమలు చేస్తామని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి పదే పదే హామీ ఇచ్చిన విషయం గుర్తుందన్నారు.

Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్​కల్యాణ్​

PV Ramesh Comments on Siemens Project : గుజరాత్‌లో పర్యటించిన బృందం పరిశీలనలు మినహా..సీమెన్సు ఇండియా, డిజైన్‌ టెక్‌లు పేరున్న సంస్థలని నిర్ధారించడానికి ఆధారం ఏమిటని సీఐడీ ప్రశ్నించింది. గుజరాత్‌ సందర్శించిన బృందం పరిశీలన, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారం తప్ప ఆ రెండు సంస్థలు పేరున్న సంస్థలని నిర్ధారించుకోవడానికి తనకు ఇతర మార్గాలు ఏవీ లేవని పీవీ రమేశ్‌ బదులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఈ రెండు సంస్థలు ఎంతో పేరున్నవని చెప్పిన విషయం తనకు గుర్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే అవకాశం ఉన్న ఉన్నతాధికారుల మాటలు నమ్మకపోతే కార్యాలయంలో మాత్రమే ఉండే అధికారి ఎలా పని చేయగలరని ఎదురు ప్రశ్నించారు.

Premchandra Reddy is responsible for Implementation of the Siemens Project : సీమెన్సు ఇండియా, డిజైన్‌ టెక్‌ సంస్థలు 90శాతం ఖర్చు చేశాయని ఎలా నిర్ధారిస్తారని.. గ్రాంటు స్వభావం ఏమిటో పరిశీలించారా..ఏ సాంకేతిక భాగస్వామి వాటా ఎంత శాతం? అసలు ఖర్చు ఎంత? గ్రాంటు తర్వాత ఖర్చు ఎంత అయిందో మీరు ధ్రువీకరించారా అని సీఐడీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టును ఆమోదించడానికి, బడ్జెట్‌ కేటాయింపులకు ముందే ఈ అంశాలన్నీ పరిశీలించాల్సి ఉందని...ఇది పూర్తిగా నైపుణ్యాభివృద్ధి సంస్థ బాధ్యతని...దాన్ని సమీక్షించాల్సింది ఆర్థికశాఖ అని పీవీ రమేశ్‌ సమాధానం ఇచ్చారు.

ఆ తర్వాత మంత్రిమండలి పరిశీలించి ఆమోదించాలన్నారు. శాసనసభ అవసరమైన బడ్జెట్‌ కేటాయిస్తుందని... ప్రాజెక్టుపై పడే భారం, తదితర అన్ని అంశాలను ప్రాజెక్టు ఆమోదించే సమయంలోను, నిధులు కేటాయించే సమయంలోనే సమగ్రంగా పరిశీలించాలన్నారు. ఈ కసరత్తు అంతా తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడాని కన్నా ముందే అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అజేయకల్లాం ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఆ తర్వాత మంత్రిమండలి ఆమోదించిందని... ఈ ప్రాజెక్టును సంబంధిత అధికారులు ఆమోదించిన తర్వాత అప్పటికే అమలులో ఉన్న విధివిధానాల ప్రకారం బడ్జెట్‌ కేటాయిస్తారని...నిధులు విడుదల చేస్తారని సమాధానం ఇచ్చారు.

అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి మొత్తం డాక్యుమెంట్లు అన్నీ ఆర్థికశాఖకు సమర్పించారని పేర్కొన్నారని... డిజైన్‌ టెక్‌కు ముందుగానే నిధులు విడుదల చేసే క్రమంలో వీటన్నింటినీ పరిశీలించి సరి చూసుకున్నారా అన్న సీఐడీ ప్రశ్నించింది. ఆర్థిక శాఖ, లేదా ఆర్థికశాఖ కార్యదర్శి ప్రోద్బలంతోనే నిధులు విడుదలవుతాయనేది అసంబద్ధమన్న పీవీ రమేశ్‌.... అది ప్రేమ్‌చంద్రారెడ్డి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చన్నారు. ఆశాఖ ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అక్కడి అధికారులే నిధులు సవ్యంగా వినియోగమయ్యేలా చూసేందుకు ప్రధాన బాధ్యులని బదులిచ్చారు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పరికరాల సరఫరా కోసం భాగస్వాములతో ఒప్పందాలు చేసుకున్నామని, ప్రాజెక్టు అమలుకు పూర్తి సిబ్బందితో కూడిన బృందం ఉందని సీమెన్స్‌ ఎండీ పేర్కొన్నట్లు ప్రశ్నావళిలో సీఐడీ ప్రస్తావించింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లేదా ఆర్థికశాఖ పరిశీలించిందా అని అడిగింది. శాఖల రోజువారీ కార్యకలాపాలతో ఆర్థికశాఖకు సంబంధం లేదన్న పీవీ రమేశ్.... ఈ బాధ్యత నైపుణ్యాభివృద్ధి శాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లదేనని స్పష్టం చేశారు.

185 కోట్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని..మిగిలిన మొత్తాన్ని 2015 డిసెంబరు 20లోగా విడుదల చేయాలని సీమెన్స్‌ ఎండీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించకుండానే ఆర్థికశాఖ ఎలా పరిగణనలోకి తీసుకుందని సీఐడీ ప్రశ్నించింది. బాహ్య సంస్థ అభ్యర్థన మేరకు ఆర్థికశాఖ వ్యవహరించలేదన్న పీవీ రమేశ్...వనరుల కోసం చర్యలు తీసుకోవాలన్న సంబంధిత శాఖ అభ్యర్థనకు అనుగుణంగానే ఆర్థికశాఖ వ్యవహరించిందని సమాధానమిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌ కింద నిధుల విడుదల విషయంలో బడ్జెట్, అంతర్గత వ్యవహారాల కార్యదర్శి పరిశీలనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రశ్నించింది. బడ్జెట్‌ విడుదల అంటే నిధుల విడుదల కాదన్న పీవీ రమేశ్ .... నిబంధనలకు అనుగుణంగా నిధుల్ని వినియోగించాల్సిన బాధ్యత నైపుణ్యాభివృద్ధి శాఖపై ఉందని బదులిచ్చారు...

నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టులో సాంకేతిక భాగస్వాములైన సంస్థలకు ముందస్తుగానే డబ్బులు చెల్లించేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీపై ఒత్తిడి తెచ్చారా అన్న సీఐడీ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదే పదే గుర్తు చేసేవారన్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖ నుంచి కూడా నిరంతరం ఆ డిమాండ్‌ ఉండేదని.... తన 61 ఏళ్ల జీవితంలో ఎన్నడూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని బదులిచ్చారు. నైతిక ప్రమాణాలకు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఏ పనీ చేయలేదన్నారు..

ఎంవోయూలో ఎలాంటి బ్యాంకు గ్యారెంటీల ప్రస్తావన లేకపోయినా అడ్వాన్సుగా డబ్బులు ఎలా విడుదల చేశారని సీఐడీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పరికరాలు, సాఫ్ట్‌వేర్, కోర్స్‌వేర్, అవసరమైన మనుషులను సమకూర్చేందుకు తాము ఇప్పటికే పారిశ్రామిక భాగస్వాములతో ఒప్పందం చేసుకున్నామని ఆ సంస్థలు చెప్పిన మాట నిజమా? కాదా అని పీవీ రమేష్‌ను స్పష్టత కోరింది. అది నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీల బాధ్యతన్న పీవీ రమేశ్‌... వారితో సంప్రదించి ఈ విషయాన్ని నిర్ధారించుకోండని బదులిచ్చారు.

ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు, అందుబాటులో ఉన్న నోట్‌ఫైల్స్‌ ప్రకారం... అప్పట్లో అలాంటి సరఫరా ఒప్పందాలపై సంతకం చేయలేదని, వారి క్లెయిమ్‌ను పరిశీలించలేదని స్పష్టమవుతోందని...అయినా సరే నిధుల విడుదలకు సంబంధించిన బీఆర్‌వోలకు మీరు ఎలా ఆమోదం తెలిపారని సీఐడీ అడిగింది. బీఆర్‌వోల జారీకి 2015-16లో అమల్లో ఉన్న విధివిధానాలను సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులతో మీరు పరిశీలించుకోవొచ్చని పీవీ రమేశ్‌ సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టులను నిరాటంకంగా అమలు చేయటంలో సంబంధిత శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను అందుబాటులో ఉంచటానికే బీఆర్‌వోలు జారీ చేస్తామన్నారు. అంతే తప్ప ఆర్థిక సూత్రాలను పాటించకుండా, ఆర్థిక వివేకం లేకుండా నిధులు వినియోగించటానికి కాదన్నారు. బీఆర్‌వో జారీ చేసినంత మాత్రాన బాహ్య సంస్థలు అడిగినట్లుగా చేయగలమని సంబంధిత శాఖాధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని బదులిచ్చారు.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

Last Updated : Sep 10, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.