ETV Bharat / snippets

జీవన్​ రెడ్డి మాల్​ వివాదం - వారంలో బకాయిలు చెల్లించకుంటే మళ్లీ స్వాధీనం

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 1:11 PM IST

TS HC Orders to Jeevan Reddy Mall
Jeevan Reddy Mall Issue (ETV Bharat)

TGS RTC on Jeevan Reddy Mall Issue : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్​స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు ఈ నెల 23వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. సంస్థకు పెండింగ్​లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్​ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్​ను కోర్టు ఆదేశించినట్లు యాజమాన్యం ప్రకటించింది. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం జీవన్​ రెడ్డి మాల్​ భవనాన్ని టీజీఎస్ ​ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్​లో కూడా సకాలంలో బకాయిలు చెల్లించకపోతే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాల్​ను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 24న హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ మూసివేసిన మాల్​ను తెరిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.