ETV Bharat / snippets

రంగారెడ్డిలో ఘోర ప్రమాదం - బస్సు, కారు ఢీ - ముగ్గురు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 9:10 AM IST

Updated : May 24, 2024, 11:12 AM IST

RTC BUS and Car Accident at Ramnunthala
Road Accident in Rangareddy (ETV Bharat)

3 Persons Died in Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్​ - శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్​ వెళ్తుంది. ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (35), నిఖిల్ (26), మణిదీప్ (25)లను హైదరాబాద్​లోని కర్మన్​ఘాట్​ వాసులుగా గుర్తించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Last Updated : May 24, 2024, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.