ETV Bharat / snippets

లారీల కోసం రైతుల ఆందోళన - మంత్రి శ్రీధర్​ బాబు నియోజవర్గం కావడమే తప్పా?

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 5:35 PM IST

Etv BharatCrop Procurement in Manthani
Lack Of lorry Transportation For Crop Procurement in Manthani (ETV Bharat)

Lack Of lorry Transportation For Crop Procurement in Manthani : పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు గ్రామాల్లో ధాన్యం తరలింపుకోసం లారీలు ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు. 37 సెంటర్లలో 10 సెంటర్లలోని ధాన్యాన్ని తరలించి కేంద్రాలను మూసివేశారు. ఇప్పటివరకు 2,673 మంది రైతుల వద్ద 2,42,303 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి కేవలం 25లారీల ధాన్యం మాత్రమే తరలించారని తెలిపారు. అయితే మంథని శ్రీధర్ బాబు నియోజకవర్గంలో కావడంతో ధాన్యంలో కోతలు విధిస్తే ప్రభుత్వానికి సమాచారం అందుతుందనే ఉద్దేశంతో రైస్​ మిల్లర్లు వెనుకాడుతున్నారని చర్చ జరుగుతోంది. లారీలు తగినంతగా సకాలంలో రాకపోవడంతో ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలని అన్నదాతలు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.