Congress Hanumath Rao On Rajeev Gandhi Statue In Uppal Stadium : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఉప్పల్ స్టేడియానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడగ్గానే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేరు ఉందికానీ అక్కడ ఆయన విగ్రహం లేదన్నారు. స్డేడియంలో విగ్రహం ఏర్పాటు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అమలాపురంలో 13 అడుగుల ఎత్తు, వెయ్యి కిలోల కంచుతో తన సొంత ఖర్చుతో తయారు చేయించినట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని అంబేడ్కర్ సన్మానించిన శిల్పి శ్రీనాథ్ వడియార్ వారసుడైన రాజ్‌కుమార్ వడియార్‌తో చేయించినట్లు వీహెచ్ వివరించారు. రాజీవ్‌గాంధీ జయంతి రోజైన ఆగస్టు 20వ తేదీనా ఆయన విగ్రహాన్ని ఉప్పల్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని తన కోరిక అని తెలిపారు.
ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి : వీహెచ్
Published : May 25, 2024, 4:15 PM IST