ETV Bharat / snippets

ఏపీ సెట్​ ఫలితాలు వచ్చేశాయ్​ - మీరు అర్హత సాధించారా?

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 5:28 PM IST

APSET 2024 Results OUT
APSET 2024 Results OUT (ETV Bharat)

APSET 2024 Results OUT : అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (ఏపీ సెట్​) - 2024 ఫరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ సెట్​ పరీక్షను ఏప్రిల్​ 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా, ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. అర్హత సాధించిన వారి వివరాలు, ఫైనల్​ కీ, ర్యాంక్ కార్డు, సబ్జెక్టుల వారీ కటాఫ్ మార్క్స్​, అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏపీ సెట్​ పరీక్షకు 30,448 మంది హాజరయ్యారు. వీరిలో అర్హత సాధించిన 2,444 మంది అభ్యర్థుల వివరాలను హాల్​ టికెట్​ నెంబర్లతో సహా ప్రత్యేక జాబితాను విశ్వ విద్యాలయ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ స్కోర్​ కార్డును డౌన్​లోడ్ చేసుకునేందుకు హాల్​టికెట్​ నంబర్​, పుట్టిన తేదీని ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.