మిర్చి పంటను వీడని చీడపీడలు - అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలు - warangal Chilli Farmers Problems

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 6:48 PM IST

thumbnail

warangal Chilli Farmers Problems : కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అనే విధంగా మారింది మిర్చి రైతన్నల పరిస్థితి. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో అధిక శాతం రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులతో స్థానికంగానే కాకుండా బయటి రాష్ట్రాలకు అమ్మేవారని రైతులు తెలిపారు. ఈ ఏడాది మిర్చి పంట మొదట్లోనే వేసినా నార్లకు నీళ్లు లేక ఎండిపోయాయని చెప్పారు. ఒకటికి రెండుసార్లు మొక్కలు నాటినప్పటి నుంచి మొక్కలపై నల్ల పేను వచ్చిందని పేర్కొన్నారు. 

ఐదు సంవత్సరాలుగా ప్రతికూల వాతావరణాల కారణంగా చీడపీడల బెడద ఉక్కిరి బిక్కిరి చేస్తుందని వెల్లడించారు. ఈ కారణంగా దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్​లో తాము పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధరలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే తాము బతికేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి పంటను విదేశాలకు ఎగుమతి చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.