ఎన్నికల కోడ్ ఉల్లంఘన- మూకుమ్మడిగా వాలంటీర్ల రాజీనామా - Volunteers Resignation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 12:11 PM IST

thumbnail

Volunteers Resignation in Anantapur District: నియమావళిని ఉల్లంఘించిన తమపై అధికారులు చర్యలు తీసుకుంటారన్న భావనతో కొందరు వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని వెలిగొండ గ్రామానికి చెందిన 11 మంది వాలంటీర్లు తమ రాజీనామా లేఖను సోమవారం ఎంపీడీవో అమృత్ రాజ్​కు అందజేశారు. వారిని ఎంపీపీ నరసింహులు, ఆ గ్రామ వైసీపీ నాయకుడు నాగప్ప వెంట పెట్టుకుని అధికారి వద్దకు వచ్చారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన రాజకీయ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉండటంతో చర్యలకు అధికారులు సిద్ధం అయ్యారు. 

అయితే ఈలోపే ఇంతలోనే వాలంటీర్లు రాజీనామాలు అంటూ వచ్చారు. దీంతో వాలంటీర్లపై ఎంపీడీవో ఆగ్రహానికి గురయ్యారు. వాలంటీర్ల మాటలకు ఎంపీపీ కూడా వత్తాసు పలికారు. వాలంటీర్ల నుంచి రాజీనామా లేఖలను తీసుకున్న ఎంపీడీవో వారి వద్ద ఉన్న ప్రభుత్వ మొబైల్ ఫోన్, ఇతర సామాగ్రిని పంచాయతీ కార్యదర్శికి అందించాలని చెప్పారు. అనంతరం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలకు కూడా ప్రతిపాదిస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.