ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం - ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు - Ugadi Celebrations Srisailam Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 4:42 PM IST

thumbnail

Ugadi Celebrations in Srisailam Temple: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సందడితో రద్దీగా మారింది. శనివారం నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని భక్తులు నల్లమల్ల కొండల నుంచి పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. వేలాదిగా వచ్చిన భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం కళకళలాడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేసుకుని భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

మరోవైపు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవ సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురువారం శ్రీశైల జగద్గురు సేవా సమితి ట్రస్ట్ వారి సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరాబాద్​కు చెందిన శ్రీ వేదాంతం సత్య నరసింహ శాస్త్రి కూచిపూడి ఆర్ట్ అకాడమి, బిఆర్​విఎస్ పవన్ కుమార్ చరణ్ బృందం, కర్ణాటక భాగ్యలక్ష్మీ పాటిల్ బృందం వారి భక్తి గీతాలాపన నృత్య సంగీతంతో కళాకారులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.