షాపింగ్​మాల్​లో సన్​రైజర్స్​ టీం సందడి - ఫ్యాన్స్ ఫుల్​జోష్ - SRH Team Meet Audience Video

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 5:25 PM IST

thumbnail

SRH Team Visit City Mall in Hyderabad : భాగ్యనగరంలో సన్​రైజర్స్​ హైదరాబాద్​ టీం సభ్యులు ఓ మాల్​లో సందడి చేశారు. ప్రేక్షకులను కలిసి మాట్లాడారు. ఎస్​ఆర్​హెచ్​ టీంలోని హేన్రిచ్ క్లాసెన్, తంగరసు నటరాజన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ సిటిమాల్​లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో మాట్లాడారు. 

SRH Team talk with Audience in Hyderabad : క్రికెటర్లను చూసేందుకు ఆ మాల్​కు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే కేరింతలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్​ ఫోన్​లో క్రికెటర్ల ఫొటోలను తీసుకుంటూ ఆనందించారు. సన్ రైజర్స్ టీమ్ సభ్యులు సరదాగా కాసేపు అభిమానులతో మాట్లాడారు. సౌతాఫ్రికా క్రీడాకారుడు హేన్రిచ్ క్లాసెన్ తెలుగులో ఎలా ఉన్నారు అని అన్నారు. మే 2న హైదరాబాద్​లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్​ కోసం వచ్చారు. గురువారం సన్​రైజర్స్​ టీం రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​ ఆడనుంది. ప్రస్తుతం సన్​రైజర్స్ పాయింట్​ టేబుల్​లో నాలుగో స్థానంలో ఉంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.