ఉద్రిక్తతకు దారితీసిన దుకాణాల కూల్చివేత - పోలీసులు, వర్తకుల మధ్య వాగ్వాదం - Demolition of shops Issue

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 3:34 PM IST

thumbnail
ఉద్రిక్తతకు దారితీసిన దుకాణాల కూల్చివేత - పోలీసులు, వర్తకుల మధ్య వాగ్వాదం (ETV Bharat)

Demolition Of Shops Issue : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి వద్ద రహదారుల విస్తరణలో భాగంగా దుకాణాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. పెద్దపల్లి నుంచి మంథని వెళ్లే మార్గంలో నాగేపల్లి కూడలి వద్ద అక్రమణలు జరిగాయనే ఉద్దేశ్యంతో అధికారులు ఇవాళ ఉదయం మూడు దుకాణాలను కూల్చివేతకు పూనుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జేసీబీలు తీసుకొచ్చి నిర్మాణాలు కూల్చివేస్తున్నారని బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

33 అడుగుల వరకు తొలగించాలని తమకు నోటీసులు ఇవ్వడమో లేదా మార్కింగ్ చేస్తే తామే ఆక్రమణలు తొలగిస్తాం కదా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్‌అండ్​బీ అధికారులు తమకు చెప్పినా వినకపోతే ఇలా దౌర్జన్యం చేస్తే సరిపోతుందని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సామానులు తొలగించుకోవడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు రక్షణ కల్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు తమను కోరారని, అందుకే రక్షణ కల్పిస్తున్నామని నోటీసులతో తమకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.