వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 7:25 PM IST

thumbnail

Selection Of Candidates For Parliament In BJP : పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక వారం రోజుల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లు దోపిడి దొంగల పార్టీలుగా కిషన్​ రెడ్డి అభివర్ణించారు. బీఆర్​ఎస్​ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీగా పేర్కొన్న కేంద్రమంత్రి ఏ పార్టీతోనూ కలవదని స్పష్టం చేశారు. 

Lok Sabha election 2024 : ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓ మూర్ఖుడని తెలిపారు. బీజేపీకి ఒకటే జెండా ఓకే దేశం అనే ఒకటే నినాదంతో ముందుకు వెళ్తామని కిషన్​ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ, బీఆర్​ఎస్​ పార్టీలు ఒకటేనని కిషన్​ రెడ్డి అన్నారు. మూడు పార్టీలు అహంకారంతో పనిచేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్నివర్గాల అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.