'యూపీఏ ప్రభుత్వం ఏనాడు పీవీ నరసింహరావు పేరెత్తలేదు'

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 9:53 PM IST

thumbnail

PV Narasimha Rao Grand Son Fires on Congress : పీవీ నరసింహారావు కాంగ్రెస్​కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనకు ఆ పార్టీలో గౌరవం లేదని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు, బీజేపీ నేత ఎన్​వీ సుభాశ్​ తెలిపారు. పీవీ కాంగ్రెస్​ పార్టీకి చెందినప్పటికీ బీజేపీ ఆయనకు భారతరత్న(Bharat Ratna) ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు పీవీ నరసింహారావు ఊసే ఎత్తలేదని, ఎలాంటి అవార్డులు ప్రకటించలేదని మండిపడ్డారు. మంచి జరిగితే కాంగ్రెస్​ పార్టీ, గాంధీ కుటుంబం తీసుకుంది, వైఫల్యాలను పీవీ నరసింహారావు మీద వేసేవారని ఆవేదన చెందారు. 

PV Narasimha Rao Grand Son Comments on Gandhi Family : ఆయనకు భారతరత్న రాకుండా, విషం చిమ్మే విధంగా గాంధీ కుటుంబం చాలా చాలా కీలకపాత్ర పోషించిందని విమర్శించారు. ఇది పీవీ(PV Narasimha Rao) కుటుంబానికి దక్కిన గౌరవమని నరేంద్ర మోదీ జాతీయ నాయకుడిగా, యావత్​ ప్రపంచానికి నాయకుడిలా మారిన కీలక తరుణంగా ఇలా భారతరత్న ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఆలస్యమైనా చాలా ఏళ్లుగా ఎదురు చూశామన్నారు. కానీ తెలంగాణ బీజేపీ ప్రయత్నాల వల్లే ఈ రోజు పీవీకి భారత అత్యుత్తమ పురస్కారం లభించిందని ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పీవీ నరసింహారావు మనవడు చెప్పారు. తాము కన్న కల, గొప్ప విజయం నెరవేరిందని ఎమోషనల్​ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.