మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్​ - చెరువులో ఫుల్​ ట్యాంక్​ లెవల్లో నిర్మించిన గోడ కూల్చివేత - Illegal Constructions demolished

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:17 PM IST

thumbnail
Mallareddy Illegal Construction Demolished (ETV Bharat)

Mallareddy Illegal Construction Demolished : బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్​ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా షామీర్​పేట్ మండలం బొమ్మరాశిపేట పెద్ద చెరువులోని ఫుల్​ట్యాంక్ లెవెల్​లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు. చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు.  

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బొమ్మరాశిపేట గ్రామంలోని పెద్ద చెరువు శిఖరంలో 7 ఎకరాలు మల్లారెడ్డి ఆధీనంలో ఉంది. ఇందులో కొంత మేర చెరువు ఎస్​టీఎల్ పరిధిలో ఉండడంతో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం అందులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జేసీబీ యంత్రాలతో కూల్చివేశారు. ఈ మేరకు అక్రమంగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్లో నిర్మాణాలు చేపట్టవద్దని పలుమార్లు చెప్పినా, నోటీసులు ఇచ్చినా స్పందించకుండా గోడ పెట్టడం చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.