భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పని ఏంటీ?

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 6:50 PM IST

Updated : Feb 17, 2024, 7:11 PM IST

thumbnail

Nara Bhuvaneswari Comments about Saree: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఇటీవల పలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు చేసిన పనితో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందంటూ, భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి. ఇంతకీ అవి ఏంటీ అనేదేగా మీ సందేహం. 

వివరాల్లోకి వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగిందని భువనేశ్వరి వెల్లడించారు. చాలా మంది భర్తలు వారి భార్యకు విలువైన వస్తువులు తీసుకొస్తారు, మీరు మాత్రం ఏం తీసుకొనిరారు. ఎందుకు అని చంద్రబాబును భువనేశ్వరి అడిగారట. ఆ మాటలను గుర్తు పెట్టుకొని మరీ ఓ రోజు చంద్రబాబు చీర తీసుకొని వచ్చారట. అయితే దానిని చూడగానే భువనేశ్వరికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందట. ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉందంటూ నవ్వులు పూయించారు. అయినాా సరే తన భర్త తీసుకొనివచ్చిన చీరను జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నట్లు భువనేశ్వరి తెలిపారు. తన భర్తకు ఎప్పుడూ ప్రజాసేవ ధ్యాసే తప్పా, కుటుంబం గురించి ఆలోచన తక్కువ అనేది తన ఉద్దేశ్యమని భువనేశ్వరి పేర్కొన్నారు. 

Last Updated : Feb 17, 2024, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.