షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్​కు అప్పనంగా కాంట్రాక్టులు: ఎంపీ బాలశౌరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 9:59 PM IST

thumbnail

MP Vallabhaneni Balasouri Angry With AP Government : షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలుగా రాయితీలు ఇస్తోందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆరోపించారు. షిర్డీ సాయి సంస్థ అక్రమాలకు అంతేలేదన్న ఆయన స్మార్ట్ మీటర్ల పంపిణీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే భారీగా ధర పెంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. సోలార్ పానల్స్ తయారీ కోసం షిర్డీ సాయి సంస్థకు అడ్డగోలుగా రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు. ఆ సంస్థలో బయటకు కనిపించేది విశ్వేశ్వరరెడ్డి అయినా ఆ వెనక ఓ పెద్ద సార్ ఉన్నారని తెలిపారు. దీనిపై కేంద్ర సంస్థలు విచారణ చేపట్టే అవకాశం ఉందన్నారు. 

స్మార్ట్ మీటర్ల కుంభకోణంలో అధికారులు కూడా జైలుకు వెళ్లటం ఖాయమని హెచ్చరించారు. మరోవైపు ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీపై త్వరలో ఈడీతో పాటు కేంద్ర సంస్థలు దృష్టి సారిస్తాయని బాలశౌరి తెలిపారు. ప్రస్తుత ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ పెద్దలకు నేరుగా ఆదాయం వస్తోందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని దీనిపై కలెక్టర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుకపై వచ్చే ఆదాయమంతా 2, 3 కుటుంబాలకే చెందుతోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.