స్నేహితులతో కలిసి డ్యాన్స్​ చేసిన మంత్రి కొండా సురేఖ - వీడియో వైరల్

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 11:36 AM IST

thumbnail

Minister Konda Dance In Hanmakonda : మంత్రి అయినా, సాధారణ పౌరులైనా తమకు నచ్చిన వారు పక్కన ఉన్నప్పుడు చిన్న పిల్లలయిపో గంతులేయడం కామన్. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కూడా తన స్నేహితుల మధ్య అలాగే మారిపోయారు. తన మిత్రులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. హన్మకొండ లష్కర్ బజార్​లోని సుజాత రెడ్డి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తన బ్యాచ్ మెట్స్​తో పాటు పలువురు సీనియర్స్, జూనియర్స్​తో కలిసి వేడుకల్లో సంతోషంగా గడిపారు. 

ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి మంత్రి కొండా సురేఖ డ్యాన్స్ చేశారు. ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. మంత్రితో తన స్నేహితులు, జూనియర్స్ సెల్ఫీలు దిగారు. బిజీ షెడ్యూల్​లోనూ మంత్రి సురేఖ తమతో ఉత్సాహంగా గడిపినందుకు మిత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొండా సురేఖ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.