ఉద్యోగులు సున్నితంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు: మంత్రి ధర్మాన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 6:09 PM IST

thumbnail

Minister Dharmana Comments on Employees and Govt: ఇటీవల కడప రెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.  తాజాగా మంత్రి ధర్మాన అదే తరహాలో ఉద్యోగులను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఉద్యోగులది, ప్రభుత్వానిది గమ్మత్తైన బంధమని ఒకరిపై ఒకరు పోరాడుకోవాలని మళ్లీ కలిసిపోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంతో సున్నితంగా మాట్లాడితే కుదరదని ఉద్యోగ సంఘ నాయకులు గట్టిగా ప్రశ్నించాలని మంత్రి హితబోధ చేశారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గ సన్మాన సమావేశంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడవదని స్పష్టం చేసిన ధర్మాన ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకుంటే అమలు చేసేవారు మాత్రం ఉద్యోగులే అన్నారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరగవని అన్నారు. ఉద్యోగ నాయకులు అంటే అందరికి న్యాయం జరిగేలాగా చూడాలని మీ సమస్యలు పరిష్కారం కావాలంటే సున్నితంగా కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమించాలని మంత్రి ధర్మాన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.