ఇద్దరు మహిళల హత్య కేసులో కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 5:27 PM IST

thumbnail

Kurnool Family Court Sentenced Accused in Murder Case to Death: ఇద్దరు మహిళలను హత్య చేసిన ఘటనలో కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కర్నూలు నగరంలోని చింతల మునినగర్​లో 2023 మార్చి 14న తండ్రి, కొడుకులు నారాపురంప్రసాద్‌, శ్రావణ్ కుమార్ తల్లి కూతుర్లను దారుణంగా హత్య చేశారు. ఈకేసులో నాలుగో అదనపు జిల్లా జడ్జి ప్రతిభా దేవి ఇద్దరు నిందితులకు ఉరి శిక్ష విధించింది. హత్యలకు సహకరించిన కృష్ణవేణికి జీవిత ఖైదీగా శిక్ష విధించారు.

కేసు వివరాల్లోకి వెళితే తెలంగాణలోని వనపర్తికి చెందిన వెంకటేష్ కుమార్తె రుక్మిణి కర్నూలులోని చింతలముని నగర్​కు చెందిన శ్రవణ్ కుమార్​కు గతేడాది వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత ఆరోగ్య కారణాలతో శోభనం జరగకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో రుక్మిణి(భార్య) వెంకటేష్ (మామ) రమాదేవి(అత్త)లను హత్య చేయాలని శ్రవణ్ కుమార్ పథకం ప్రకారం వారిని కర్నూలుకు పిలిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి వారిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కర్నూలు ఫ్యామిలీ కోర్టు ఏ1 శ్రావణ్ కుమార్, ఏ2 ప్రసాద్​లకు ఉరిశిక్ష, ఏ3 కృష్ణవేణికి జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.