వైద్యులు కేవలం ధనలక్ష్మి కటాక్షం కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా సేవలందించాలి : పొన్నం ప్రభాకర్

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 11:47 AM IST

thumbnail

Initiate State Level Conference Of Orthopaedic Doctors In Karimnagar : రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించినా, ట్రామా కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుల మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆర్థోపెడిక్ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం గాయపడిన వారిని తీసుకెళితే తప్ప వైద్యం లభించే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రభుత్వం ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని పొన్నం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించడం పట్ల ప్రత్యేక శ్రద్దతో ఉందని చెప్పారు. అందువల్లే అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోపే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు.  

Ponnam Prabhakar In Karimnagar : వైద్యులు కేవలం ధనలక్ష్మి కటాక్షం కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా తమ సేవలందించాలని కోరారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పులు చేసినా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం అహర్నిషలు కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1400 మంది ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.