భక్త జనసంద్రమైన యాదాద్రి ఆలయం - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 1:09 PM IST

thumbnail
భక్త జనసంద్రమైన యాదాద్రి దేవాలయం - దర్శనానికి 3 గంటల సమయం (ETV Bharat)

Devotees Rush in Yadadri Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్​లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిని ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. 

Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ఆలయంలో స్వామివారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.