LIVE : వరంగల్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ - CM Revanth Road Show at warangal
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 7, 2024, 7:50 PM IST
|Updated : May 7, 2024, 9:18 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21409833-thumbnail-16x9-cm-revanth-campaign.jpg)
CM Revanth Election Campaign in Warangal Live : సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరంగల్ పార్లమెంటరీ ప్రాంతంలో ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మూడోసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లకు హాజరయ్యారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొని విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.