LIVE : నిజామాబాద్​ కార్నర్ మీటింగ్​లో పాల్గొన్న సీఎం రేవంత్​రెడ్డి - CM REVANTH REDDY LIVE

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 7:14 PM IST

Updated : May 8, 2024, 9:41 PM IST

thumbnail

CM Revanth Live : తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఆ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​ రెడ్డి అన్నీ తానై పార్టీ శ్రేణుల్లో జోష్​ నింపుతూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. హస్తం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయా జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్​ రోడ్​షో అనంతరం నిజామాబాద్​ కార్నర్​ మీటింగ్​లో రేవంత్​ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. రేవంత్​ రెడ్డి నిజామాబాద్​​ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి పార్టీకార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్​లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​కు కాంగ్రెస్​ గ్యారంటీల గురించి విమర్శించే నైతికహక్కు లేదని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. 

Last Updated : May 8, 2024, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.