బడ్జెట్ సమావేశాలకు ఆటోల్లో వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - మండలిలో నల్లకండువాలతో నిరసన

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 11:05 AM IST

thumbnail

BRS Leaders Went Assembly in Autos : ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్​లో బీఆర్ఎస్ వినూత్నంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బడ్జెట్ సమావేశాలకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో చేరుకున్నారు. అయితే వారిని అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, నెలకు రూ.10,000లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. 

Telangana Budget Sessions 2024 : ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఆటోవాలా కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. బడ్జెట్​లో ఆటోవాలాలకు నిధులు కేటాయించాలన్నారు. మరోవైపు సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని శాసన మండలికి వచ్చిన గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను తొలుత భద్రతా సిబ్బంది అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి పంపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.