గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులను ఎందుకు తగ్గించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : దాసోజు శ్రవణ్

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 7:03 PM IST

thumbnail

BRS Leader Dasoju Sravan Fires on Congress : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే, కేవలం 40 లక్షల మందికి మాత్రమే 500 రూపాయల సిలిండర్​కు అర్హులంటున్నారని ధ్వజమెత్తారు. లబ్ధిదారులను ఎందుకు తగ్గించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్న శ్రవణ్, లేదంటే అంకుశంలా వెంటాడతామని హెచ్చరించారు.

అన్ని కాకుండా మూడు నుంచి ఐదు సిలిండర్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా నేరుగా రూ.500 కే సిలిండర్ ఇవ్వాలన్న ఆయన, ముందు మొత్తం డబ్బులు కట్టించుకొని మళ్లీ రీఎంబర్స్ చేయడం సబబు కాదన్నారు. ప్రజలు కోరుకుంటున్నందునే మోసం చేస్తున్నామని గతంలో అన్న రేవంత్ రెడ్డి, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటలు నిజం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.